CM KCR Express Deep Condolences: రామలింగారెడ్డి మృతిపట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

CM KCR Express Deep Condolences: రామలింగారెడ్డి మృతిపట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
x
Highlights

CM KCR Express Deep Condolences: దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి...

CM KCR Express Deep Condolences: దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ మేరకు తెలంగాణ సీఎంఓ ద్వారా ఓ ప్రకటన జారీ అయింది. "ఎమ్మెల్యే శ్రీ సోలిపేట రామలింగారెడ్డి మరణం పట్ల సీఎం శ్రీ కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉద్యమ సహచరుడిగా, ఒకే ప్రాంత వాసిగా తనతో ఎంతో అనుబంధం ఉందని సీఎం గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించారు" అని సీఎంఓ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది.

దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి (57) బుధవారం అర్ధరాత్రి కన్నుమూశారు. గతకొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతన్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిశారు. సోలిపేట రామలింగారెడ్డి కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవలే కాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. చికిత్స అనంతరం కాలికి ఇన్‌ఫెక్షన్‌ కావడంతో అస్వస్థతకు గురయ్యారు. మళ్లీ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలో చికిత్స పొందుతుండగా గుండెపోటు రావడంతో అర్ధరాత్రి కన్నుమూశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories