CM KCR: నేడు 4 నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్‌ సభలు

CM KCR Election Campaign In Four Constituencies
x

CM KCR: నేడు 4 నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్‌ సభలు

Highlights

CM KCR: షాద్‌నగర్‌, చేవెళ్ల, అందోల్‌, సంగారెడ్డిలో ప్రచారం

CM KCR: తెలంగాణలో పార్టీల ప్రచారం చివరి అంకానికి చేరుకుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉన్న తరుణంలో గులాబీ బాస్‌ ప్రచారంలో స్పీడ్‌ పెంచారు. రెండోవిడత ఎన్నికల ప్రచారంలో గులాబీ దళపతి టాప్‌గేర్‌లో దూసుకుపోతున్నారు. రోజుకు 4 నియోజకవర్గాల్లో పర్యటనలు చేస్తూ.., ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటూ.. ఇటు అభ్యర్థులు, అటు ప్రజల్లో జోష్‌ నింపుతున్నారు.

ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పిస్తూ... అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే అంశాలను ప్రజలకు వివరిస్తున్నారు. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా ప్రచారంలో బీఆర్ఎస్ టాప్ గేర్‌లో దూసుకుపోతోంది. భవిష్యత్‌లో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామంటూ సీఎం కేసీఆర్‌ నిర్వహిస్తున్న వరుస సభల్లో చెప్పుకొస్తున్నారు. మరోవైపు సీఎం కేసీఆర్ టీమ్‌ సైతం ఇదే వైఖరిని అవలంభిస్తూ ప్రజల్లోకి బీఆర్ఎస్‌ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories