ఫారెస్ట్ ఆఫీసర్ మృతి పట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి.. 50 ల‌క్షల ఎక్స్‌గ్రేషియా, అధికారిక లాంఛ‌నాల‌తో అంత్యక్రియ‌లు..

CM KCR Condolence on Fro Srinivasa Rao Death
x

ఫారెస్ట్ ఆఫీసర్ మృతి పట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి.. 50 ల‌క్షల ఎక్స్‌గ్రేషియా, అధికారిక లాంఛ‌నాల‌తో అంత్యక్రియ‌లు..

Highlights

ఫారెస్ట్ ఆఫీసర్ మృతి పట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి.. 50 ల‌క్షల ఎక్స్‌గ్రేషియా, అధికారిక లాంఛ‌నాల‌తో అంత్యక్రియ‌లు..

Bhadradri: భధ్రాద్రి కొత్తగూడెం జిల్లాలో, గుత్తికోయల దాడిలో మరణించిన ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు మరణం పట్ల సీఎం KCR తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. దోషులకు కఠిన శిక్షలు పడేలా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్‎రెడ్డిని సీఎం ఆదేశించారు. మరణించిన FRO కుటుంబానికి 50 లక్షల ఎక్స్‎గ్రేషియా ప్రకటించారు.

శ్రీనివాసరావు బతికి ఉండగా జీతభత్యాలు ఎలా అందేవో... అవే నిబంధనల ప్రకారం పూర్తి వేతనాన్ని అతని కుటుంబానికి అందించాలని సీఎం ఆదేశించారు. రిటైర్‎మెంట్ వయస్సు పరిగణనలోకి వచ్చే వరకు ఫారెస్ట్ ఆఫీసర్ కుటుంబ సభ్యులకు వేతనం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. కారుణ్య నియామకం కింద కుటుంబ సభ్యుల్లో అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కేసీఆర్ ఆదేశించారు. FRO పార్థివదేహానికి ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని అందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్‎ను సీఎం ఆదేశించారు. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై దాడులను ఏమాత్రం సహించబోమని దోషులను కఠినంగా శిక్షస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories