Krishna Water: ఇక రాజీలేని పోరాటమే...కేసీఆర్

CM KCR Clarifies That Will not Compromise on State Share in Krishna Water
x

CM KCR

Highlights

Krishna Water: కృష్ణా జలాల వినియోగంలో ఇక ఎక్కడా రాజీపడమని సిఎం కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు.

Krishna Water: కృష్ణా జలాల వినియోగంలో ఇక ఎక్కడా రాజీపడమని రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని వేదికల మీద రాజీ లేకుండా పోరాడతామని తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు. నదీ జలాల్లో తెలంగాణకు హక్కుగా రావాల్సిన నీటి వాటాను రాబట్టుకోవడంతో సహా, తెలంగాణ లిఫ్టులను నడిపించుకునేందుకు జలవిద్యుత్ ఉత్పత్తిని కొనసాగించాలని రాష్ట్ర కేబినెట్ ఇప్పటికే నిర్ణయించింది.

ఈ నేపథ్యంలో ట్రిబ్యునల్స్, న్యాయస్థానాలు సహా రాబోయే పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ వాణిని బలంగా వినిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటాను నిర్ధారించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పలు సందార్భాల్లో కేంద్రాన్ని ఒత్తిడి చేస్తూ వస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ నేపధ్యంలో కృష్ణా ట్రిబ్యునల్, కెఆర్ఎంబీ తదితర వేదికల మీద తెలంగాణ వాణిని బలంగా వినిపించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది.

నదీ జలాల్లో రాష్ట్ర సాగునీటి వాటాను హక్కుగా పొందడానికి, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేసే దిశగా సీఎం కేసీఆర్ అధ్యక్షతన అత్యున్నతస్థాయి సమావేశం జరిగింది. ఆరు గంటలకు పైగా జరిగిన సమీక్షా సమావేశంలో తెలంగాణకు దశాబ్దాలుగా జరుగుతున్న సాగునీటి వివక్ష గురించి సమావేశం లోతుగా చర్చించింది. స్వయం పాలనలో సాగునీటి కష్టాలను ఎట్టి పరిస్థితిల్లోనూ రానివ్వకూడదని సమావేశం తీర్మానించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories