CM KCR: ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ కుమారుని వివాహానికి హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్‌

Cm Kcr Attends Mla Gampa Govardhan Sons Marriage In Kamareddy
x

CM KCR: ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ కుమారుని వివాహానికి హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్‌

Highlights

CM KCR: సీఎం కేసీఆర్ కామారెడ్డికి రావాలంటూ యువత నినాదాలు

CM KCR: కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కుమారుడికి వివాహానికి సీఎం హాజరైన సందర్భంగా ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. తమ నియోజకవర్గం కామారెడ్డిలో పోటీ చేయాలని ఇప్పటికే నిర్ణయించుకున్న సీఎం కేసీఆర్‌ను స్వాగతిస్తూ, పెండ్లికి హాజరైన కామారెడ్డి నియోజకవర్గ ప్రజలు, యువత హర్షాతిరేకాలతో కేరింతలతో స్వాగత నినాదాలు ఇచ్చారు. సీఎం కేసీఆర్ రావాలి.. స్వాగతం కామారెడ్డికి స్వాగతం... కేసీఆర్ రావాలి... కేసీఆర్ కావాలి... జై కేసీఆర్.. దేశ్‌కీ నేత కేసీఆర్ అనే నినాదాలతో పెళ్లి ప్రాంగణం దద్దరిల్లింది. అయితే వారికి కరచాలనం చేస్తూ, ఫొటోలకు అవకాశమిస్తూ, దారి పొడవునా అభిమానులకు పార్టీ కార్యకర్తలకు అభివాదం చేస్తూ అధినేత కేసీఆర్ ముందుకు సాగారు.

Show Full Article
Print Article
Next Story
More Stories