వాసాల‌మ‌ర్రి ద‌ళితుల అకౌంట్ల‌లో రేపే 10 ల‌క్ష‌ల చొప్పున‌ జ‌మ‌ : సీఎం కేసీఆర్

CM KCR Announce On Dalitha Bandhu In Vasalamarri
x

వాసాల‌మ‌ర్రి ద‌ళితుల అకౌంట్ల‌లో రేపే 10 ల‌క్ష‌ల చొప్పున‌ జ‌మ‌ : సీఎం కేసీఆర్

Highlights

Vasalamarri: ప్రజాకవి గోరెటి వెంకన్న దళిత జాతి ఆణిముత్యమన్నారు సీఎం కేసీఆర్.

Vasalamarri: ప్రజాకవి గోరెటి వెంకన్న దళిత జాతి ఆణిముత్యమన్నారు సీఎం కేసీఆర్. ఆయన రాసిన పాటలు సమాజాన్ని, ఉద్యమానికి ఊపిరిపోశాయని సీఎం స్పష్టం చేశారు. దేశంలో దళితులు వివక్షకు గురైయ్యారని సీఎం కేసీఆర్ అన్నారు. దళితులు సోమరిపోతులు కాదని చెమటను చిందించే వారని స్పష్టం చేశారు. వారు సంపదను సృష్టించే వారని అన్నారు. బీఆర్ అంబేద్కర్ దళితుల కోసం పోరాడారు ఆయన ఫలితంగానే వాళ్లకు రిజర్వేషన్లు వచ్చాయని పేర్కొన్నారు. దళితులు ఇంకా పేదరికంలోనే ఉన్నారన్నారు. దత్తత గ్రామం వాసాలమర్రి గ్రామంలో దళితుల వాడను మూడు గంటల పాటు తిరిగారు.

వాసాల మర్రిలో ఉన్న ఇళ్లన్ని మట్టి గోడలతో ఉన్నాయని తన పర్యటనలో తేలిందని సీఎం కేసీఆర్ అన్నారు. ఎక్కడ చూద్దామంటే కూడా ఒక్క ఇటుక ఇళ్లు కూడా కనిపించడం లేదని అన్నారు. గ్రామస్తులు ఒప్పుకుంటే వాటన్నింటిని కూలగొట్టి పక్కా ఇళ్లు నిర్మిస్తామని వెల్లడించారు. వాసాలమర్రిలో భూమి లేని దళితులు చాలా మందే ఉన్నారని సీఎం కేసీఆర్ అన్నారు. వారందరికి భూమి పంచాలన్నారు. గతంలో ప్రభుత్వాలు పంచిన భూమి వారి చేతిలో ఉందో లేదో తెలుసుకునేందుకు తానే చర్యలు తీసుకుంటానని కేసీఆర్ అన్నారు. దళితులకు ఉన్న భూమి ఎంత ఉన్నోళ్లు ఎంత మంది లేనోళ్లు ఎంతమందో లెక్కలు తీస్తారని తెలిపారు. వాసాలమర్రిలో వంద ఎకరాల మిగులు భూమి తేలిందన్నారు. దాన్ని కూడా దళితులకే పంచేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు.

వాసాల మర్రిలో 76 దళిత కుటుంబాలకు తక్షణమే దళిత బంధు అమలు చేస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. రేపటి నుంచే అకౌంట్‌లో పది లక్షల రూపాయలు జమా చేస్తారని స్పష్టం చేశారు. దళిత బంధు సొమ్ముపై పూర్తి బాధ్యత దళితులదేనన్నారు. ఎవరూ ఏం చేసుకుంటారో ఆలోచించుకోవాలని సీఎం సూచించారు. దేనిపై ఇంట్రెస్ట్ అది చేసుకోవాలని సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories