పీవీ న‌ర‌సింహారావు విగ్ర‌హాన్ని ఆవిష్కరించిన ముఖ్య‌మంత్రి కేసీఆర్

CM KCR and Governor Tamilisai Inaugurated the PV Narasimha Rao Statue
x

పీవీ నరసింహారావు విగ్రహం (ఫైల్ ఇమేజ్)

Highlights

PV Narasimha Rao Birth Anniversary: పీవీ న‌ర‌సింహారావు విగ్ర‌హాన్ని గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై, ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆవిష్క‌రించారు

PV Narasimha Rao Birth Anniversary: .మాజీ ప్రధాని, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ న‌ర‌సింహారావు విగ్రహాన్ని గ‌వ‌ర్నర్ త‌మిళిసై, సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. పీవీ శ‌త జ‌యంతి ముగింపు ఉత్సవాల సంద‌ర్భంగా పీవీ విగ్రహానికి గ‌వ‌ర్నర్, సీఎం కేసీఆర్ ఘ‌న నివాళుల‌ర్పించారు. అంతకు ముందు పీవీ మార్గ్‌ను గ‌వ‌ర్నర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పీవీ కుటుంబ స‌భ్యులు, ప‌లువురు అధికారులు పాల్గొన్నారు. నెక్లెస్ రోడ్డులో 26 అడుగుల ఎత్తులో పీవీ కాంస్య విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

పీవీ ఒక కీర్తి శిఖరం అని.. పీవీ ఎన్నో సంస్కరణలకు ఆద్యుడని కొనియాడారు సీఎం కేసీఆర్. పీవీ బహుభాష కోవిదుడన్న సీఎం..కాకతీయ విశ్వవిద్యాలయంలో పీవీ పీఠం ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నో భూ సంస్కరణలు తీసుకొచ్చారని.. పీవీ చరిత్ర అందరికీ ఆదర్శమన్నారు. విగ్రహాన్ని చూస్తుంటే పీవీని చూస్తున్నట్లే ఉందని వ్యాఖ్యానించారు సీఎం కేసీఆర్.


Show Full Article
Print Article
Next Story
More Stories