నేడు వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే

CM KCR Aerial Survey in Flood Affected Areas Today
x

నేడు వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే

Highlights

CM KCR: భద్రాచలంలో వరద ప్రాంతాలను పరిశీలించనున్న సీఎం కేసీఆర్‌

CM KCR: వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ రెండ్రోజుల పాటు ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. అధిక వానలతో గోదావరి పరీవాహక ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని స్వయంగా పరిశీలించేందుకు ఇవాళ, రేపు ఏరియల్‌ సర్వే నిర్వహించనున్నారు. కాసేపట్లో వరంగల్‌ నుంచి భద్రాచలం దాకా హెలికాప్టర్‌లో పర్యటించి ఏరియల్‌ సర్వే చేస్తారు.

భద్రాచలంలో పర్యటించి, వరద ముంపు వల్ల సంభవించిన నష్టం, చేపడుతున్న వరద సహాయక చర్యలపై స్థానిక మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షిస్తారు. అకడినుంచి ఏటూరునాగారం ప్రాంతంలో ఏరియల్‌ సర్వే చేపట్టి, వరద సహాయక చర్యలపై అధికారులతో సమీక్షించనున్నారు. అనంతరం ఏటూరునాగారం నుంచి హైదరాబాద్‌ చేరుకొని సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళీ బోనాల ఉత్సవాల్లో పాల్గొంటారు. తిరిగి రేపు ఉదయం ఉత్తర తెలంగాణలోని SRSP, కడెం, కాళేశ్వరం ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే చేపట్టి, వరద బాధితులను పరామర్శించి, వారికి భరోసా ఇవ్వనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories