Jani Master Case: జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం.. కొరియోగ్రాఫర్‌కు తప్పని చిక్కులు

Jani Master Case: జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం.. కొరియోగ్రాఫర్‌కు తప్పని చిక్కులు
x
Highlights

Hyderabad Police Filed Chargesheet in Jani Master Case: జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. లేడీ కొరియోగ్రాఫర్‌పై లైంగిక...

Hyderabad Police Filed Chargesheet in Jani Master Case: జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. లేడీ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా వచ్చిన ఆరోపణలు నిజమేనని నిర్ధారిస్తూ నార్సింగ్ పోలీసులు చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈవెంట్స్ పేరుతో బాధితురాలిని వేరే ప్రాంతాలకు తీసుకెళ్లిన సందర్భాల్లో ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా పోలీసులు తమ చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు.

జానీ మాస్టర్ పూర్తి పేరు షేక్ జానీ మాస్టర్. జానీ మాస్టర్ తనపై పలుమార్లు లైంగికంగా దాడికి పాల్పడ్డాడని 21 ఏళ్ల యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై సెప్టెంబర్ 15న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కేసు నమోదైన నేపథ్యంలో జానీ మాస్టర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పోలీసులు ఆయన ఆచూకీ తీసి సెప్టెంబర్ 19న గోవాలో అరెస్ట్ చేశారు. కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది.

ప్రకటించిన అవార్డ్ వెనక్కు తీసుకున్న కేంద్రం

జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడానికంటే ముందుగా కేంద్రం ఆయనకు జాతీయ అవార్డ్ ప్రకటించింది. ఆ అవార్డ్ తీసుకునేందుకు తనకు బెయిల్ ఇవ్వాల్సిందిగా ఆయన పిటిషన్ దాఖలు చేసుకున్నారు. కోర్టు కూడా జానీ మాస్టర్‌కు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది.

జానీ మాస్టర్ అక్టోబర్ 8న ఢిల్లీలో జరగనున్న అవార్డ్స్ ఫంక్షన్‌కు హాజరయ్యేందుకు బెయిల్‌పై విడుదలయ్యారు. కానీ అంతలోనే అక్టోబర్ 6న కేంద్రం సంచలన ప్రకటన చేసింది. జానీ మాస్టర్‌పై POCSO ACT కింద కేసు నమోదైనందున ఆయనకు ఇవ్వనున్నట్లు ప్రకటించిన అవార్డును ఉపసంహరించుకుంటున్నట్లు కేంద్రం ప్రకటించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories