ఖమ్మం మార్కెట్ కార్యాలయాన్ని మట్టడించిన రైతులు.. మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్

Chilli Farmers besieged The Market Office In Khammam
x

ఖమ్మం మార్కెట్ కార్యాలయాన్ని మట్టడించిన రైతులు.. మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ 

Highlights

Khammam: వ్యాపారులు మోసం చేస్తున్నారని రైతుల ఆరోపణ

Khammam: ఖమ్మం లో మిర్చి రైతులు మార్కెట్ కార్యాలయాన్ని ముట్టడించారు రైతులు. మద్దతు ధర జెండా పాట ప్రకారం కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. మార్కెట్ లో నేటి జెండాపాటకు కేవలం ముగ్గురు కొనుగోళ్లు దారులు వచ్చి తమ నోట్లో మట్టి కొట్టారని రైతులంటున్నారు. జెండా పాట 21600 ఉండగా కొనుగోళ్లు మాత్రం కేవలం 14 నుంచి 16 లోపే చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మిర్చి క్వాలిటీ లో తేడా ఉంటే క్వింటాకు 500,1000 రూపాయలు తగ్గిస్తే పర్వాలేదని కానీ, దారుణంగా 5 వేల రూపాయల నుంచి నుంచి 6వేల రూపాయలు తగ్గిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం మార్కెట్ దోపిడీ కి అడ్డాగా మారిందని ఆరోపిస్తున్నారు. రేపు ఎల్లుండి సెలవు కావడంతో దళారులు, మార్కెట్ అధికారులు కుమ్మక్కై రైతు నడ్డి విరుస్తున్నారన్నారు. విషయం తెలిసుకొని అక్కడకు వచ్చిన జిల్లా జాయింట్ కలెక్టర్, అదనపు కలెక్టర్ లను రైతులు నిలదీశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories