CM Revanth Reddy: తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త ..సన్నవడ్లపై కీలక ప్రకటన

Chief Ministers review in Secretariat on DSC selected polarization of rice procurement
x

CM Revanth Reddy: తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త ..సన్నవడ్లపై కీలక ప్రకటన

Highlights

CM Revanth on Paddy Procurement : ధాన్యం కొనుగోళ్లలో తాలు, తరుగు, తేమ పేరుతో రైతులను మోసం చేస్తున్న వారి క్రిమినల్ కేసులు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.అవసరమైన చోట కొత్త ఐకేపీ కేంద్రాలను ఏర్పాటు సూచించారు. ఈ సీజన్ నుంచే ప్రభుత్వం సన్న వడ్లకు ఒక్కో క్వింటాలుకు రూ. 500 బోనస్ చెల్లిస్తుందని స్పష్టం చేశారు.

CM Revanth on Paddy Procurement : ధాన్యం కొనుగోళ్లలో తాలు, తరుగు, తేమ పేరిట రైతులను మోసం చేసే వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అవసరమైన చోట కొత్త ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సన్నవడ్లకు బోనస్ ఇస్తున్నాం కాబట్టి ఎలాంటి అవకతవకలు లేకుండా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. గురువారం ధాన్యం కొనుగోళ్లు, డీఎస్సీ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనపై సచివాలయం నుంచి జల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 7వేల ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు సీఎంకు అధికారులు తెలిపారు.

రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఈ సీజన్ నుంచే సన్నవడ్లకు కనీస మద్దతు ధరకు అదనంగా ఒక్కో క్వింటాలకు రూ. 500 బోనస్ చెల్లిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతి కేంద్రానికి క్రమ సంఖ్య ఇవ్వాలని సన్నవడ్ల కొనుగోళ్లకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులు తెలిపారు. గోనె సంచులు అందుబాటులో పెట్టాలని చెప్పారు. ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యం వెంటనే తరలించాలని తెలిపారు. వాతావరణ శాఖ సూచనలకు అనుగుణంగా ఐకేపీ కేంద్రాల్లో ఏర్పాట్లు చేయాలన్నారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి ధాన్యం రాష్ట్రంలోకి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ధాన్యం కొనుగోలులో వ్యవసాయ అధికారులు భాగస్వామ్యం కావాలని కలెక్టర్లు, క్షేత్రస్థాయిలో పరిశీలించాలని తెలిపారు. రోజూ రెండు గంటల సమీక్షించాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ధాన్యం కొనుగోళ్లపై కాల్ సెటర్ ఏర్పాటు చేయాలని తెలిపారు. రాష్ట్రంలో రైతులు అందరూ సన్న బియ్యం పండించేలా అధికారులు చొరవ చూపించాలని సీఎం సూచించారు.

డీఎస్సీకి ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన రేపటి వరకు పూర్తి చేయాలని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి. అక్టోబర్ 9న నియామక పత్రాలను అందజేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుత సీజన్ లో 66. 73 లక్షల ఎకరాల్లో వరసాగు చేయగా రికార్డు స్థాయిలో 140 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ధాన్యం అమ్మిన రైతులకు 48 గంటల్లో వారి ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం చేస్తోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories