ఢిల్లీ బాట పట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్

Chief Minister KCR In Delhi
x

ఢిల్లీ బాట పట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్

Highlights

CM KCR: మూడు రోజుల పాటు హస్తినలోనే ఉండనున్న సీఎం

CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ చాలా రోజుల తర్వాత ఢిల్లీ బాట పట్టారు. మూడు రోజుల పాటు హస్తినలోనే ఉండనున్నారు. రాష్ట్రపతి ఎన్నికలు ముగిసి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న తరుణంలో కేసీఆర్ హస్తిన పర్యటనకు వెళ్లడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. సీఎం కేసీఆర్ తో పాటు టీఆర్ఎస్ ఎంపీలు నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిసే అవకాశాలున్నాయి. కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న పోడు భూముల చట్ట సవరణ, తెలంగాణలో గిరిజన, మైనార్టీ రిజర్వేషన్ల పెంపు బిల్లు ఆమోదం, భద్రాచలం వద్ద తెలంగాణ నుంచి ఏపీలో విలీనం చేసిన ఐదు గ్రామాలను రాష్ట్రానికి తిరిగి ఇప్పించడం తదితర అంశాలను రాష్ట్రపతికి నివేదించనన్నట్లు తెలుస్తోంది.

మరో వైపు ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్ ను సీఎం కేసీఆర్ కలిసే అవకాశం ఉందని అధికార వర్గాల్లో చర్చ కొనసాగుతుంది. రాష్ట్రానికి వరద సహాయం, విభజన హమీల అమలుపై విజ్ఞాపనలు ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే అధికారికంగా ఎవరి అపాయింట్ మెంట్ ఖరారు కాలేదు. కొంతకాలంగా ప్రధాని మోడీ కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ సీఎం కేసీఆర్ చేసిన విమర్శల నేపథ్యంలో ప్రధాని అపాయింట్ మెంట్ కోరుతారా అందుకు ప్రధాని అంగీకరిస్తారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో 14 వందల కోట్ల మేరక నష్టం వచ్చిందని ప్రాథమిక అంచనా వేసిన ప్రభుత్వం. వెయ్యి కోట్లు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరింది. కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించి మూడు రోజులు అయినా ఎలాంటి సహం ప్రకటించలేదు. వరద సహాయంతో పాటు రాష్ట్ర విభజన చట్ట హామీలపై మరో సారి కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.

దేశ రాజకీయాల్లో కీలకంగా మారాలని కొంత కాలంగా సీఎం కేసీఆర్ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రాంతీయ పార్టీల నేతలను కలుస్తూ వచ్చారు. బీజేపీ వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని వాళ్లతో భేటీ అయిన సందర్బంలోనూ చర్చించార. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో కేంద్ర ప్రభుత్వ పెద్దలతో పాటు ప్రాంతీయ పార్టీల నేతలను కలుస్తారా అనేది వేచి చూడాలి. మరో వైపు విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్ధి మార్గరేట్ ఆల్వాకు మద్దతు కోస విపక్ష పార్టీలు ఢిల్లీలో నిర్వహిచే సమావేశానికి కేసీఆర్ ను ఎన్సీపీ అధినేత శరధ్ పవార్ ఆహ్వానించినట్లు తెలిసింది. అయితే ఈ సమావేశానికి కేసీఆర్ హాజరవుతారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories