Shamshabad: శంషాబాద్‌లో చిరుత కలకలం

Cheetah Movement in Shamshabad
x

Shamshabad: శంషాబాద్‌లో చిరుత కలకలం

Highlights

Shamshabad: శంషాబాద్‌లో చిరుత పులి కలకలం సృష్టించింది. ఘన్సీమియాగూడ శివారులో చిరుత సంచారం స్థానికులను భయాందోళనకు గురి చేస్తోంది.

Shamshabad: శంషాబాద్‌లో చిరుత పులి కలకలం సృష్టించింది. ఘన్సీమియాగూడ శివారులో చిరుత సంచారం స్థానికులను భయాందోళనకు గురి చేస్తోంది. పొలంలో కుక్కలపై చిరుత దాడి చేసి చంపేసింది. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటున్నారు రైతులు. చిరుతను బంధించాలని కోరుతున్నారు. సీసీ కెమెరాల్లో కనిపించిన జంతువు‌ జాడల్ని కనిపెట్టాలని కోరుతున్నారు. గ్రామంలో వ్యవసాయంపై అదారపడే తాము పొలం వెళ్లాలంటే అరచేతిలో ప్రాణాల్ని పెట్టుకొని వెళ్తున్నామని, వెంటనే అధికారులు సకాలంలో స్పందించి చిరుతను పట్టుకోవాలని కోరుతున్నారు.

కాగా, నెల రోజుల క్రితం శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టు సమీపంలో చిరుతతో పాటు రెండు పిల్లలు ఎయిర్‌ పోర్టు లోపలికి ప్రవేశించేందుకు ప్రహరీ దూకేందుకు ప్రయత్నించాయి. అయితే ఫెన్సింగ్‌ వైర్లకు చిరుత తగలడంతో ఎయిర్‌ పోర్ట్‌ కంట్రోల్‌ రూం అలారం మోగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే చిరుతను, దాని పిల్లల్ని బందించారు. ఆ సంఘటన మరువక ముందే మళ్ళీ చిరుత అనవాళ్లు గుర్తించడంతో స్థానికుల్లో భయాందోళన మొదలైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories