EV Machines: ఇవాళ, రేపు ఈవీఎంల తనిఖీలు

Checking of EVMs Today And Tomorrow
x

EV Machines: ఇవాళ, రేపు ఈవీఎంల తనిఖీలు

Highlights

EV Machines: అందరూ సంతృప్తి వ్యక్తం చేసిన ఈవీఎంలు పోలింగ్‌లో వినియోగం

EV Machines: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోసం కేటాయించిన ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్లను గురు, శుక్రవారాల్లో తనిఖీలు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించింది. దీనిపై అన్ని రాజకీయ పార్టీలకు ముందస్తు సమాచారం అందించింది. ఈవీఎంలలో అందరూ సంతృప్తి వ్యక్తం చేసిన వాటికి సీలు వేసి పోలింగ్‌ ప్రక్రియలో వినియోగించాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఎన్నికల పరిశీలకులు, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ‎ఈవీఎంలను తనిఖీ చేస్తారు.

ఈవీఎంలు, వీవీ ప్యాట్స్‌, కంట్రోల్‌ యూనిట్లను ఉదయం తొమ్మిది నుంచి రాత్రి ఏడు గంటల వరకు రోజుకు రెండు షిప్ట్‌లలో తనిఖీ చేస్తారు. రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షంలోనే డమ్మీ ఓట్లను వేసి, తరువాత లెక్కిస్తారు...ఈ ప్రక్రియ సజావుగా సాగితే బాగా పనిచేస్తున్నట్టుగా పరిగణించి సీల్‌ వేస్తారు. ఒకవేళ తప్పుగా ఫీడ్‌చేసినా,తప్పుగా లెక్కించినా పక్కన పెడతారు. తొలిదశ ఈవీఎంలు, వీవీ ప్యాట్లు, కంట్రోల్‌ యూనిట్ల తనిఖీ కీలకమైనందున ప్రతి రాజకీయపార్టీ ప్రతినిధులు వాటిని పరిశీలించాలని అధికారులు కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories