Telangana: భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో రాష్ట్రంలో కేంద్ర బృందం పర్యటన

Central Government Team for Telangana
x

Telangana: భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో రాష్ట్రంలో కేంద్ర బృందం పర్యటన

Highlights

Telangana: ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు రానున్న ఆరుగురు సభ్యుల బృందం

Telangana: తెలంగాణ ప్రభుత్వం నష్ట అంచనాలను కేంద్రానికి పంపిన నేపథ్యంలో వరదలపై అధ్యయనానికి కేంద్ర బృందం తెలంగాణకి రానుంది. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు ఆరుగురు సభ్యుల బృందం రానుంది. వరదల తీవ్రత, నష్టాలపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నారు. 2 రోజుల పర్యటనలో భద్రాచలం, కడెం ప్రాజెక్టుల సందర్శన చేయనున్నారు. రాష్ట్రంలో జరిగిన వరద నష్టం అంచనా వేయనున్నారు. అనంతరం రాష్ట్రానికి కేంద్రం సహాయాన్ని ప్రకటించనుంది.

రాష్ట్రంలో భారీ వర్షాలతో ప్రకృతి విపత్తు మూలంగా సంభవించిన వరద నష్టాలపై ప్రాధమిక అంచనాలను రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసి కేంద్రానికి నివేదించింది. పలు శాఖల్లో సుమారు 1400 కోట్ల రూపాయల వరద నష్టం సంభవించినట్టుగా కేంద్రానికి నివేదికలు అందించింది. ఈ నేపథ్యంలో తక్షణ సాయం కింద వెయ్యి కోట్లను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. వరదల వల్ల కాజ్‌వేలు, రోడ్లు కొట్టుకుపోవడం తదితర కారణాల వల్ల రోడ్లు భవనాల శాఖకు సంబంధించి 498 కోట్ల నష్టం వాటిల్లింది.

పంచాయతీ రాజ్‌శాఖలో 449 కోట్లు, ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌ 33 కోట్లు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌లో 379 కోట్లు, విద్యుత్ శాఖలో 7 కోట్ల నష్టం వాటిలినట్లు.. ఆయా శాఖలు ప్రాథమిక అంచనాల ద్వారా నివేదికలు సిద్ధం చేసి.. కేంద్రానికి అందజేశాయి. అదే సందర్భంలో ఇళ్లు కూలిపోవడం ముంపునకు గురికావడంతో పాటు.. వారిని తరలించే క్రమంలో 25 కోట్లు, ఇంకా తదితర వరద నష్టాలు వెరసి మొత్తంగా 1400 కోట్ల మేరకు రాష్ట్రంలో వరద నష్టం సంభవించిందని నివేదికలు సిద్ధం చేసి కేంద్రానికి పంపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories