CMR Collage: గర్ల్స్ హాస్టల్లో సీక్రెట్ కెమెరాలు? బాత్రూమ్ లో వీడియోలు తీశారంటూ.. మేడ్చల్ సీఎంఆర్ విద్యార్థినుల ఆందోళన

CMR Collage: గర్ల్స్ హాస్టల్లో సీక్రెట్ కెమెరాలు? బాత్రూమ్ లో వీడియోలు తీశారంటూ.. మేడ్చల్ సీఎంఆర్ విద్యార్థినుల ఆందోళన
x
Highlights

CMR Collage: హాస్టల్ బాత్రూంలో వీడియోలు తీసారంటూ.. మేడ్చల్ లోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. హాస్టల్లో పనిచేసే సిబ్బంది...

CMR Collage: హాస్టల్ బాత్రూంలో వీడియోలు తీసారంటూ.. మేడ్చల్ లోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. హాస్టల్లో పనిచేసే సిబ్బంది విద్యార్థులను అసభ్యంగా వీడియో తీశారని ఆరోపిస్తూ బుధవారం రాత్రి ఆందోళన చేపట్టారు.

సిఎంఆర్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ లో స్నానాల గదిలో వీడియోలు తీశారని ఆరోపిస్తూ బుధవారం రాత్రి విద్యార్థులు ఆందోళన చేపట్టారు. మేడ్చల్ లోని కండ్లకోయ సిఎంఆర్ ఐటి కాలేజ్ లోని విద్యార్థులు వసతి గృహంలో వీడియో చిత్రీకరించినట్టు ధర్నాకు దిగారు. విద్యార్థినీలకు విద్యార్థి సంఘాలు బాసటగా నిలిచాయి. నిందితులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చేంతవరకు ఆందోళన విరమించేది లేదని హాస్టల్ బయట బైఠాయించారు

కాలేజీ హాస్టల్ లో జరుగుతున్న పరిణామాలపై విద్యార్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్లో పనిచేసే సిబ్బందిలో కొందరు బాత్రూంలో విద్యార్థుల వీడియో తీశారని యాజమాన్యానికి ఫిర్యాదు చేయగా.. బాత్రూమ్ వెంటిలేటర్ నుంచి వీడియోలు తీశారని చెప్తే విద్యార్థులను చులకన చేసి అసభ్యంగా మాట్లాడాలని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. హాస్టల్లో నెలకొన్న పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసినా..యాజమాన్యం పట్టించుకోవడంతో ధర్నాకు దిగారు.

విద్యార్థినిలు బుధవారం అర్ధరాత్రి దాటేవరకు ఆందోళన చేపట్టారు. విద్యార్థుల మద్దతుగా వచ్చిన విద్యార్థి సంఘాల నేతలను కాలేజీలోకి అనుమతించకపోవడంతో వారు గేటు బయట ధర్నాకు దిగారు. సెక్యూరిటీ సిబ్బంది గదిపై ఆందోళనకారులు దాడి చేసి అద్దాలను చేశారు.

విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో అక్కడికి చేరుకున్న పోలీసులు హాస్టల్ నిర్వాహలతో చర్చలు జరిపారు. అక్కడ పనిచేసిన సిబ్బంది వద్ద ఉన్న 12 మొబైల్ ఫోన్లు, ఐదుగురు సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విద్యార్థుల బాత్రూం వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తే.. ఎమ్మెల్యే మల్లారెడ్డి బాధ్యత వహించాల్సి ఉంటుందని విద్యార్థులు హెచ్చరిస్తున్నారు

Show Full Article
Print Article
Next Story
More Stories