CP Anjani Kumar : కేసుల విచార‌ణ‌లో సీసీ కెమెరాలు కీల‌కం: సీపీ అంజ‌నీ కుమార్‌

CP Anjani Kumar : కేసుల విచార‌ణ‌లో సీసీ కెమెరాలు కీల‌కం: సీపీ అంజ‌నీ కుమార్‌
x
Highlights

CP Anjani Kumar : తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో నేరాల సంఖ్య పూర్తిగా తగ్గించేందుకు గాను ఎక్కడ చూసినా సీపీకెమెరాలను అమరుస్తున్నారు. దీంతో ఎక్కడ ఏ...

CP Anjani Kumar : తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో నేరాల సంఖ్య పూర్తిగా తగ్గించేందుకు గాను ఎక్కడ చూసినా సీపీకెమెరాలను అమరుస్తున్నారు. దీంతో ఎక్కడ ఏ నేరం జరిగినా, ఎక్కడ ఎలాంటి ప్రమాదం సంభవించినా పోలీసులు నిందులను ఇట్టే పట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. 24 గంటల పాటు నగరంలో జరిగే అన్ని విషయాలను ఈ సీసీ కెమెరాలు రికార్డు చేస్తున్నాయి. ఇక ఇప్పటికే నగరంలోని అన్ని ప్రధాన కూడల్లలో, అలాగే వ్యాపార సముదాయాల్లో సీసీకెమెరాలను బిగించారు. ఇప్పుడు ఇదే క్రమంలో అంబ‌ర్‌పేట్‌లో కూడా సీసీ కెమెరాలు అమర్చారు.

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర పోలీస్‌శాఖ అన్ని రంగాల్లో ముందుంద‌ని న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ అంజ‌నీ కుమార్ అన్నారు. నగరంలో సీసీ కెమెరాల ఆధారంగా నేరాల సంఖ్యను తగ్గిస్తున్నామని, సీసీ కెమెరాలు పోలీసు కేసుల విచారణలో కీలక ఆధారాలుగా ఉపయోగపడుతున్నాయని ఆయన తెలిపారు. ఈ క్రమంలోనే నగరంలోని అన్ని ఏరియాలలో సీసీ కెమెరాలు మరుస్తున్నామని అందులో భాగంగానే అంబ‌ర్‌పేట్‌లో రూ.2.45 కోట్ల వ్య‌యంతో ఏర్పాటు చేసామన్నారు. అంబర్ పేటలో అమర్చిన 280 సీసీ కెమెరాల‌ను స్థానిక‌ డీసీపీ కార్యాల‌యంలో ఎమ్మెల్యే కాలేరు వెంక‌టేశ్‌, సీపీ అంజ‌నీ కుమార్‌తో క‌లిసి కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా సీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ నగరంలోని సీసీ కెమెరాలు ప్ర‌తి కేసులో ముఖ‌గుర్తింపు ప‌రిజ్ఞానం ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుందని తెలిపారు. చీక‌ట్లో సైతం ముఖాల‌ను గుర్తించే సాంకేతిక ప‌రిజ్ఞానం అందుబాటులో ఉంద‌ని వెల్ల‌డించారు. ప్ర‌తి పోలీస్ స్టేష‌న్‌లో సామాజిక మాధ్య‌మాల ద్వారా 30 నుంచి 40 శాతం ఫిర్యాదులు న‌మోద‌వుతున్నాయ‌ని చెప్పారు. అన్ని విష‌యాల్లో ప్ర‌జ‌ల నుంచి స‌హ‌కారం ల‌భిస్తున్న‌ద‌ని తెలిపారు. పోలీసులు బాగా ప‌నిచేస్తున్నార‌ని కిష‌న్ రెడ్డి ప్ర‌శంసించారు. ఇక ఇదే క్రమంలో మొన్నటికి మొన్న సికింద్రాబాద్ ప‌రిధి‌లోని కర్ఖానాలో కూడా సుమారు రూ. 15 ల‌క్ష‌ల వ్య‌యంతో కమ్యూనిటీ నిఘా కెమెరాలను ఏర్పాటు చేసారు.

Show Full Article
Print Article
Next Story
More Stories