Jabardasth Artist: సింగర్‌, జబర్దస్త్‌ ఆర్టిస్ట్‌పై కేసు నమోదు.. కారణమిదే!

Case Filed On Jabardasth Artist Nava Sandeep In Golconda Police Station
x

Jabardasth Artist: సింగర్‌, జబర్దస్త్‌ ఆర్టిస్ట్‌పై కేసు నమోదు.. కారణమిదే!

Highlights

Jabardasth Artist: మధురానగర్ పోలీస్ స్టేషన్లో యువతి ఫిర్యాదు

Jabardasth Artist: ప్రేమించానన్నాడు..నీతోనే జీవితమన్నాడు. నీవు లేనిదే బతకలేనన్నాడు. మనసిచ్చిన ప్రియుడే మనువాడతాడని నమ్మి యువతి సర్వస్వం అర్పించి నిలువునా మోసపోయింది. పెళ్లికి ప్రియుడు నిరాకరిస్తుండటంతో బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రముఖ బుల్లితెర, కామెడీ షో ‘జబర్దస్త్’ ఆర్టిస్ట్, గాయకుడు నవ సందీప్‌ ప్రేమ, పెళ్లి పేరుతో ఓ యువతిని మోసం చేశాడు.2018లో పరిచయమైన యువతిని వాట్సాప్ చాటింగ్‌తో పరిచయం పెంచుకున్నాడు. ఆ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం కాస్తా.. ప్రేమగా మారింది. ప్రేమ పేరుతో శారీరకంగా వాడుకున్నాడు సందీప్. పెళ్లి చేసుకోమని యువతి అడగ్గా తప్పించుకొని తిరుగుతున్నాడు. అంతేకాదు ఆమెను దూరంగా పెట్టడం మొదలుపెట్టాడు. దీంతో మోసపోయానని తెలుసుకున్న యువతి తనకు న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories