Revanth Reddy: పోలీసుల‌పై అనుచిత వ్యాఖ్య‌లు.. రేవంత్ రెడ్డిపై కేసు న‌మోదు..

Case File On Revanth Reddy In Nagarkurnool Police Station
x

Revanth Reddy: పోలీసుల‌పై అనుచిత వ్యాఖ్య‌లు.. రేవంత్ రెడ్డిపై కేసు న‌మోదు..

Highlights

Revanth Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కేసు నమోదు అయ్యింది.

Revanth Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. ఆయనతో పాటు కాంగ్రెస్ నేతలు వంశీచంద్ రెడ్డి, సంపత్ కుమార్‌లపై నాగర్ కర్నూల్ పోలీసు స్టేషన్‌లో కేసు ఫైల్ అయ్యింది. రేవంత్ రెడ్డి పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని జిల్లా పోలీసు అసోసియేషన్ అధ్యక్షుడు గోవర్దన్ పట్వారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు రేవంత్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు వంశీచంద్ రెడ్డి, సంపత్ కుమార్‌లపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

కాగా, సోమవారం మహబూబ్ నగర్ జిల్లా నేతలు పలువురు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ ఇస్తున్న పోలీసుల పేర్లు రెడ్ డైరీలో రాసి పెట్టుకుంటామని.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి మిత్తితో సహా కలిపి చెల్లిస్తామని వ్యాఖ్యానించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories