తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలకు రికార్డు స్థాయిలో అప్లికేషన్లు

Candidates Interested in Police Jobs in Telangana | TS News
x

తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలకు రికార్డు స్థాయిలో అప్లికేషన్లు

Highlights

Telangana: 12.91 వేల దరఖాస్తులు చేసుకున్న 7.33 లక్షల మంది అభ్యర్థులు

Telangana: తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 12 లక్షల 91 వేల దరఖాస్తులు రాగా అత్యధికంగా హైదరాబాద్ నుండి రావడం విశేషం. మొత్తం 7.33 లక్షల మంది అభ్యర్థులు 12.91 లక్షల దరఖాస్తులు చేసుకున్నట్లు పోలీసు నియామక మండలి వెల్లడించింది. వీటిలో ఎస్సై పోస్టులకి 2.47 లక్షలు, కానిస్టేబుల్‌ పోస్టులకు 9.50 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు నియామక మండలి తెలిపింది. 3.55 లక్షల మంది అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం దరఖాస్తుల్లో 2.76 లక్షల మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు.

ఆగస్టు 7న ఎస్సై, 21న కానిస్టేబుల్ పోస్టులకు ప్రాథమిక అర్హత పరీక్ష నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. తేదీల్లో ఏమైనా మార్పులు ఉంటే ముందే ప్రకటిస్తామని నియామక మండలి ఛైర్మన్‌ శ్రీనివాస్‌ రావు తెలిపారు. హైదరాబాద్ జిల్లా నుంచి అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి. ఆ తర్వాత స్థానంలో రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలు ఉన్నాయి. ములుగు, ఆసిఫాబాద్, భూపాలపల్లి, నారాయణపేట్, జనగాం, సిరిసిల్ల జిల్లాల నుంచి తక్కువ సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నట్లు నియామక మండలి తెలిపింది. ఇక తెలుగులో పరీక్ష రాసేందుకు 67 శాతం మంది అభ్యర్థులు, ఆంగ్లంలో పరీక్ష రాసేందుకు 32.8 శాతం మంది ఆప్షన్‌ ఎంచుకున్నట్లు నియామక మండలి తెలిపింది. పరీక్షా తేదీ కూడా దాదాపుగా ఖరారు కావడంతో అభ్యర్థులు ప్రిపరేషన్ పై మరింత దృష్టి సారించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories