Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ నుంచి పోటీకి అభ్యర్థుల వెనకడుగు?

Candidates Backing Down From BRS To Contest In Lok Sabha Elections
x

Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ నుంచి పోటీకి అభ్యర్థుల వెనకడుగు? 

Highlights

Lok Sabha Elections 2024: నల్గొండ, భువనగిరి ముఖ్యనేతలో సమావేశం నిర్వహించనున్న కేసీఆర్

Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ నుంచి పోటీకి అభ్యర్థులు వెనకడుగు వేస్తున్నారా? అంటే పరిస్థితిలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికల బరిలో నుంచి తప్పుకునేందుకు గుత్తా అమిత్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. నల్గొండ, భువనగిరి ఎంపీ టికెట్‌లో ఒకదాన్ని గుత్తా అమిత్ ఆశించారు. గుత్తా అమిత్‌కు టికెట్ రాకుండా పలువురు నేతలు అడ్డుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. గ్రూప్ వార్ నేపథ్యంలో అమిత్ పోటీకి దూరంగా ఉంటారని టాక్ నడుస్తోంది.

ఇటు మల్కాజ్‌గిరి నుంచి పోటీకి దూరంగా ఉండాలని మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు పోటీకి ఉత్సాహం చూపిన భద్రారెడ్డి... ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మనసు మార్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటు రేపు తెలంగాణ భవన్‌లో నల్గొండ, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాల ముఖ్యనేతలో కేసీఆర్ సమావేశం నిర్వహించనున్నారు. నల్గొండ, భువనగిరి లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్ నేతతో చర్చించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories