చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో క్యాన్సర్‌ స్క్రీనింగ్ పరీక్షలు

Cancer screening tests under the auspices of Chiranjeevi Charitable Trust
x

చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో క్యాన్సర్‌ స్క్రీనింగ్ పరీక్షలు

Highlights

*పెద్దఎత్తున హాజరైన సినీ కార్మికులు, జర్నలిస్టులు

Chiranjeevi Charitable Trust: పరిశ్రమ కార్మికులు సహా అన్నివర్గాల ప్రజలను కష్టకాలంలో ఆదుకోవడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. కరోనా కష్టకాలంలో సినీపరిశ్రమ కార్మికులు సహా అభిమానులు, సామాన్య ప్రజలను ఆయన ఎంతగానో ఆదుకున్నారు. రక్తదానం, కళ్ల దానంపైనా చిరు విస్త్రతంగా ప్రచారం కల్పిస్తూనే.. సినీకార్మికులు, సినీజర్నలిస్టులు ఇతర ప్రజల కోసం ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని ఇటీవల చిరంజీవి అధికారికంగా ప్రారంభించారు. హైదరాబాద్ చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంక్‌లో జరిగిన కార్యక్రమానికి అద్భుత స్పందన వచ్చింది.

సినీ పరిశ్రమ కార్మికులు సహా సినీజర్నలిస్టులు క్యాన్సర్ స్క్రీనింగ్‌కి పెద్ద ఎత్తున హాజరయ్యారు. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ప్రఖ్యాత క్యాన్సర్ సెంటర్ భాగస్వామ్యంతో రోజుకు వెయ్యి మందికి ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను అందిస్తోంది. మొదట మూడు నగరాల్లో స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహించనున్నట్టు ఇంతకుముందే చిరంజీవి ప్రకటించారు. మొదటి శిబిరం ఈ రోజు హైదరాబాద్‌లో ఇప్పటికే దిగ్విజయం అయింది.

తర్వాత జూలై 16న విశాఖపట్నం.. జూలై 23న కరీంనగర్ లో ఈ శిబిరాలను ఏర్పాటు చేసారు. ఈ శిబిరాల్లో పాల్గొనే వారికి ఎలాంటి ఖర్చు లేకుండా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ అవకాశాన్ని సినీ కార్మికులు అభిమానులు సద్వినియోగం చేసుకోవాలన్న చిరంజీవి పిలుపు మేరకు హైదరాబాద్‌లో జరిగిన నేటి కార్యక్రమానికి గొప్ప స్పందన లభించింది.

ఎలాంటి వారికైన రెండో అవకాశం ఉంటుంది కానీ డాక్టర్లకు అలా కాదు..వారికి బ్రతికించడం మాత్రమే తెలుసన్నారు సినీ నటుడు నాగబాబు. చిరంజీవి బ్లడ్ అండ్ ఐ ఆధ్వర్యంలో స్టార్ హాస్పిటల్ సౌజన్యంతో ఉచితంగా మెగా క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాని నిర్వహించండం చాలా గర్వకారణమని నాగబాబు కొనియాడారు.

Show Full Article
Print Article
Next Story
More Stories