యువతలో పెరుగుతున్న క్యాన్సర్.. ఆ సర్వేలో సంచలన అంశాలు..

Cancer Mukt Bharat Foundation Survey Reveals 20% of Cancer Patients Below 40
x

యువతలో పెరుగుతున్న క్యాన్సర్.. ఆ సర్వేలో సంచలన అంశాలు..

Highlights

యువతలో క్యాన్సర్ బాధితులు పెరుగుతున్నాయని ఓ సర్వే వెల్లడించింది.

ఆధునిక జీవన విధానానికి అలవాటు పడిన మనిషి తన జీవన విధానంలో ఎన్నో మార్పులు చేసుకున్నాడు. విలాసవంతమైన జీవితం అనుకున్నాడు కానీ అది అనేక వ్యాధులను కూడా వెంటబెట్టుకొస్తుందని గుర్తెరుగలేదు. దీంతో నేడు ఎన్నోరకాల వ్యాధులు మనుషులపై విరుచుకుపడుతున్నాయి. అందులో క్యాన్సర్ కూడా ఒకటీ.. ఒకప్పుడు కొంత వయస్సు మళ్ళిన వారిలో కనిపించే ఈ వ్యాధి ఇప్పుడు చిన్న పిల్లలు యువత పెద్దలు తేడా లేకుండా అందరికీ వస్తుంది.ఇటీవల ఒక ప్రైవేట్ సంస్థ చేపట్టిన సర్వేలో ఆ సంస్థకు క్యాన్సర్ సంబంధించిన కాల్ సెంటర్ కు హైద్రాబాద్ నుండే ఎక్కువ కాల్స్ వచ్చినట్టు వెల్లడించారు.అందులోనూ యువకులు ఎక్కువగా ఉన్నట్లు తేల్చారు.

బీ ఏ రోమన్ ఇన్ రోమ్ అనే మాట మనం తరచూ వింటూనే ఉంటాం ఐతే ఆ మాట తూచ తప్పకుండా ఫాలో అవుతున్నారు మన నగరవాసులు. ఆధునికత వెంట పరుగులు తీస్తూ విలాసవంతమైన జీవితం గడపాలనుకుంటున్నాడు. అదే చేస్తున్నాడు కూడా.ఐతే మారిన జీవన విధానం విలసాలనే కాదు వ్యాధులను కూడా తెచ్చిపెడుతుంది.విలాసాలకు అలవాటు పడిన మానవుడు వివిధ రకాల చెడు అలవాట్లకు బానిస అవుతున్నాడు. ఇవి క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతున్నాయి. క్యాన్సర్ బారిన పడుతున్న వారిలో హైద్రాబాద్ యువకులు ముందు వరుసలో ఉన్నారని ఇటీవల ఒక ప్రైవేటు సంస్థ చేసిన సర్వేలో తేలింది.

యువతలో క్యాన్సర్ బాధితులు పెరుగుతున్నాయని ఓ సర్వే వెల్లడించింది. క్యాన్సర్ చికిత్స గురించి తెలుసుకోవడానికి తమ హెల్ప్ లైన్ నెంబర్ కు విపరీతమైన కాల్స్ వస్తున్నట్లు తెలిపింది. మార్చి ఒకటి నుంచి మే 15 వరకు 1368 కాల్స్ వచ్చాయని తెలిపింది. వారిలో 40 సంవత్సరాలలోపు వయసు ఉన్న వారు 20 శాతం ఉన్నారని సర్వే తెలిపింది. 40 సంవత్సరాల లోపు వారిలో 60 శాతం మంది పురుషులు ఉండగా..సర్వే సంస్థకు ఫోన్ చేసిన వారిలో 26శాతం మంది తల, మెడ క్యాన్సర్‎కు సంబంధించిన వారు, 16శాతం మంది గ్యాస్ట్రో ఇండస్ట్రినల్ క్యాన్సర్‎తో బాధపడుతూ ఉన్నారు. మరో 15శాతం మంది బ్రెస్ట్ క్యాన్సర్, 9 శాతం మంది బ్లడ్ క్యాన్సర్‎తో బాధపడుతున్నారని సర్వే వెల్లడించింది. అయితే హైదరాబాదు నుంచి అత్యధిక కాల్స్ హెల్ప్ లైన్ సెంటర్‎కి వెళ్లినట్లుగా సర్వే అధికారులు చెప్తున్నారు.

రోజువారి జీవన విధానంలో మార్పులు చేసుకోవడం టీకాలు తీసుకోవడం వంటి చర్యలతో ఆ క్యాన్సర్‎ను నివారించవచ్చు. అలాగే ప్రభావంతమైన స్క్రీనింగ్ స్ట్రాటజీస్‎తో బ్రెస్ట్ కొల్లాన్ క్యాన్సర్‎ను ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చు. అయితే సరైన స్క్రీనింగ్ తీసుకోకపోవడం వల్ల దేశంలోని మూడింట రెండు వంతుల క్యాన్సర్ కేసులను ఆలస్యంగా గుర్తించారని వైద్యులు తెలిపారు. దేశంలో డయాగ్నోస్ క్యాన్సర్ కేసుల్లో 27 శాతం మొదటి రెండు దశలోనే ఉన్నాయి. 63శాతం కేసులు మూడు నాలుగు దశల్లో ఉన్నాయి. తమ చికిత్స సరైనదా కాదా అప్ టు డేట్ ఉందా అని తెలుసుకోవడానికి చాలామంది బాధితులు రెండో అభిప్రాయం కోసం కాల్ చేస్తున్నారు..ఉందని చాలామంది బాధితులు అడిగారని అలాగే కుటుంబ సభ్యులకు క్యాన్సర్ రాకుండా నివారించడానికి ఏం చేయాలో అడిగి తెలుసుకుంటున్నారు

మారుతున్న జీవన శైలి,ఆహారపు అలవాట్లు,దురలవాట్లు ఈ వ్యాధి రావడానికి ముఖ్య కారణాలు.ఐతే వ్యాధి బారిన పడిన వారు కూడా ఆత్మ విశ్వాసాన్ని కోల్పోకుండా వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.క్యాన్సర్ ప్రాణాంతక వ్యాధి అయినప్పటికీ ఇప్పుడు అధునాతన చికిత్సలు అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు.వ్యాధి ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స తీసుకుంటే వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చని చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories