వనపర్తి జిల్లాలో బీఆర్‌ఎస్‌ నాయకుడి దారుణ హత్య

Brutal Murder Of BRS Leader In Wanaparthy District
x

వనపర్తి జిల్లాలో బీఆర్‌ఎస్‌ నాయకుడి దారుణ హత్య

Highlights

ఆరుబయట నిద్రిస్తున్న శ్రీధర్‌రెడ్డిని హత్య చేసిన దుండగులు

వనపర్తి జిల్లాలో బీఆర్ఎస్‌ నాయకుడు శ్రీధర్ రెడ్డి దారుణహత్యకు గురయ్యారు. కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి మండలం లక్ష్మీపల్లిలో బుధవారంనాడు అర్దరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఆరుబయట నిద్రిస్తున్న శ్రీధర్ రెడ్డిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. కొల్లాపూర్‌ మాజీ ఎమ్మెల్యే హర్షవర్దన్‌రెడ్డికి శ్రీధర్‌రెడ్డి ముఖ్య అనుచరుడు. రాజకీయ కక్ష్యతోనే శ్రీధర్‌రెడ్డిని హత్య చేశారని మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ఆరోపించారు. ఈ హత్యకు రాజకీయ కారణాలు కారణమా, భూ తగాదాలు కారణమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories