Konatham Dileep Arrest: బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా ఇంఛార్జ్‌ కొణతం దిలీప్‌ అరెస్ట్‌

BRS Social Media Incharge Konatham Dileep Arrested
x

Konatham Dileep: బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా ఇంఛార్జ్‌ కొణతం దిలీప్‌ అరెస్ట్‌

Highlights

Konatham Dileep: 2014 నుండి 2023 వరకు డిజిటల్ మీడియా డైరెక్టర్‌గా దిలీప్

Konatham Dileep Arrest: కొణతం దిలీప్ ను హైద్రాబాద్ సీసీఎస్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారనే అభియోగాలతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారని సమాచారం.

ఆసిఫాబాద్ జిల్లా జైనూరు ఘటనపై సోషల్ మీడియాలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టారని ఫిర్యాదులు రావడంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.

2014 నుంచి 2023 వరకు తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ మీడియా డైరెక్టర్ గా ఆయన పనిచేశారు. సీసీఎస్ కు దిలీప్ ను పోలీసులు తీసుకెళ్లారనే విషయం తెలుసుకున్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సహా పలువురు నాయకులు చేరుకున్నారు.

ఎన్ని కేసులు పెట్టినా ప్రశ్నించేవాళ్లు పుట్టుకొస్తారు: కేటీఆర్

ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ప్రశ్నిస్తున్న దిలీప్ ను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తప్పుబట్టారు. దిలీప్ గొంతునొక్కాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆయన విమర్శించారు.

కనీస సమాచారం ఇవ్వకుండానే ఆయనను అరెస్ట్ చేశారని ఆయన చెప్పారు. అక్రమ అరెస్టులు, నిర్భంధాలతో పాలన సాగించాలనుకోవడం భ్రమే అవుతుందన్నారు. దిలీప్ ను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.9 నెలలుగా తెలంగాణలో మాట్లాడే స్వాతంత్ర్యం లేదని ఆయన విమర్శించారు.



Show Full Article
Print Article
Next Story
More Stories