BRS: తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్‌ రైతు దీక్షలు

BRS Rythu Deeksha Across Telangana
x

BRS: తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్‌ రైతు దీక్షలు 

Highlights

BRS: అన్ని జిల్లా కేంద్రాల్లో రైతు దీక్షలు

BRS: నేడు తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో శనివారం బీఆర్‌ఎస్‌ రైతుదీక్షలు చేపట్టనున్నది. ఉదయం 11 గంటల నుంచి ఇవి ప్రారంభ మవుతాయి. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు, పార్టీ శ్రేణులు ఈ దీక్షల్లో పాల్గొంటారు. అసెంబ్లీ ఎన్నికల్లో రైతుభరోసా పేరిట కాంగ్రెస్‌ ఇచ్చిన ఏ ఒక్కహామీని నిలబెట్టుకోలేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకొచ్చి 4 నెలలు అవుతున్నా హామీలను అమలు చేయకపోగా, రైతులను ఇష్టారీతిగా అవమానాలకు గురిచేస్తుందని బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు.

రైతుబంధు విడుదలలో జాప్యం, కరెంట్‌కోతలు, ధాన్యానికి 500 బోనస్‌ హామీ ఇచ్చి నిలబెట్టుకోకపోవటమే కాకుండా కాంగ్రెస్‌ అనాలోచిత చర్యలతో 209 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని బీఆర్‌ఎస్‌ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇచ్చిన హామీలన్నీ తక్షణమే అమలుచేయాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ అన్ని జిల్లా ల్లో రైతు దీక్షలు చేయనున్నది. సిరిసిల్లలో కేటీఆర్‌, సంగారెడ్డిలో హరీశ్‌రావు, సూర్యాపేటలో జగదీశ్‌రెడ్డి, పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్‌రావు సహా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు.. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు రైతుదీక్షలు చేపట్టనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories