BRS: అసెంబ్లీ నియోజకవర్గాలపై బీఆర్ఎస్ సమీక్షలు

BRS Reviews On Assembly Constituencies
x

BRS: అసెంబ్లీ నియోజకవర్గాలపై బీఆర్ఎస్ సమీక్షలు

Highlights

BRS: 12 రోజుల్లో సమీక్షలు పూర్తి చేయాలని బీఆర్ఎస్ అధినేత ఆదేశం

BRS: తెలంగాణలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ సమావేశాలను ఈ నెలాఖరు నుంచి నిర్వహించేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. రోజుకు సుమారు 10 అసెంబ్లీ స్థానాల చొప్పున 12 రోజుల్లో సమీక్షలు పూర్తి చేయాలని బీఆర్ఎస్ అధినేత ఆదేశించినట్లు సమాచారం. ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంలో మాజీ మంత్రులు, కేటీఆర్, హరీష్‌రావు సమావేశమయ్యారు. జనవరి 3 నుంచి 22 వరకు నిర్వహించిన 17 లోక్‌సభ నియోజకవర్గాల సమీక్షా సమావేశాల నివేదికను కేసీఆర్‌కు అందజేశారు.

సమీక్షల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, సూచనలు, సలహాలను అందులో పొందుపర్చారు. అయితే అసెంబ్లీ నియోజకవర్గ సమీక్షలను ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో స్టార్ట్ చేయాలని మొదట భావించినా.. ఈ నెలాఖరు నుంచే మొదలుపెట్టాలని కేసీఆర్ ఆదేశించినట్లు సమాచారం. లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమీక్షలు తెలంగాణ భవన్‌లో నిర్వహించగా.. అసెంబ్లీ సెగ్మెంట్ల సమీక్షలను మాత్రం స్థానికంగా ఎక్కడికక్కడే నిర్వహించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో పార్టీ శ్రేణులను పునరుత్తేజం చేయడం.. వారిలో విశ్వాసాన్ని నింపడంతో పాటు పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తం చేయడమే టార్గెట్‌గా ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ పార్టీ వర్గాలు తెలిపాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories