Vemula Prashanth Reddy: బీఆర్‌ఎస్‌ 24 గంటల పాటు కరెంట్ ఇచ్చే పార్టీ.. కాంగ్రెస్ 3 గంటల పాటు కరెంట్‌ ఇచ్చే పార్టీ

BRS Party Giving 24 Hours Current Says Vemula Prashanth Reddy
x

Vemula Prashanth Reddy: బీఆర్‌ఎస్‌ 24 గంటల పాటు కరెంట్ ఇచ్చే పార్టీ.. కాంగ్రెస్ 3 గంటల పాటు కరెంట్‌ ఇచ్చే పార్టీ 

Highlights

Vemula Prashanth Reddy: కాంగ్రెస్‌కు రైతుల పట్ల ఉన్న ప్రేమ రేవంత్‌ వ్యాఖ్యల్లో తెలుస్తోంది

Vemula Prashanth Reddy: బీఆర్‌ఎస్‌ 24 గంటల పాటు కరెంట్ ఇచ్చే పార్టీ అయితే.. కాంగ్రెస్ 3 గంటల పాటు కరెంట్‌ ఇచ్చే పార్టీ అని ఎద్దేవా చేశారు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి. కాంగ్రెస్‌కు రైతుల పట్ల ఉన్న ప్రేమ... రేవంత్‌ వ్యాఖ్యల ద్వారా బహిర్గతమైందన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు ఉచిత కరెంట్ ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. ఇక.. రోడ్ల భవనాల విభాగంలో అవినీతిపై తాను ఎలాంటి విచారణకైనా సిద్ధమని ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు సవాల్ విసిరారు. ఎంపీ అర్వింద్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. నిధులను పక్కదారి మళ్లించినట్టు నిరూపిస్తే.. తాను ఏ విచారణకైనా సిద్ధమంటున్న రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి.

Show Full Article
Print Article
Next Story
More Stories