BRS Party: విస్తృతంగా బీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు: కేటీఆర్‌

Brs Party Formation Celebrations Across Telangana State
x

BRS Party: విస్తృతంగా బీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు: కేటీఆర్‌

Highlights

KTR: ఈ నెల 25న నియోజకవర్గస్థాయి పార్టీ ప్రతినిధుల సమావేశాలు

KTR: బీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ఈ నెల 25న నియోజకవర్గస్థాయి పార్టీ ప్రతినిధుల సమావేశాలు జరుగుతాయన్నారు. ఇక.. తెలంగాణ భవన్‌లో ఈ నెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుగుతుందని, పార్టీ అధ్యక్షులు కేసీఆర్‌ అధ్యక్షతన పార్టీ జనరల్ బాడీ సమావేశం కానుందని ఆయన స్పష్టం చేశారు. పలు రాజకీయ తీర్మానాలను ప్రవేశపెట్టి, చర్చించి, ఆమోదించనున్నట్టు తెలిపారు. అలాగే.. పార్టీ ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణపై పార్టీ శ్రేణులకు కేసీఆర్‌ అభినందనలు తెలపనున్నారు.

మే నెలాఖరు వరకు ఆత్మీయ సమ్మేళనాలు కొనసాగించాలని పార్టీ క్యాడర్‌కు ఆయన సూచించనున్నారు. మరోవైపు.. కంటోన్మెంట్, గోషామహల్, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జీలను నియమించారు సీఎం కేసీఆర్. కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా మర్రి రాజశేఖర్‌రెడ్డి, గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా నందకిషోర్ వ్యాస్ బిలాల్, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా ఎంపీ మాలోతు కవితను నియమించారు గులాబీ బాస్. అక్టోబర్ 10న వరంగల్‌లో పార్టీ మహాసభను ఏర్పాటు చేయనున్నారు సీఎం కేసీఆర్.

Show Full Article
Print Article
Next Story
More Stories