MLC Kavitha: ఇది సీబీఐ కస్టడీ కాదు.. బీజేపీ కస్టడీ

BRS MLC Kavitha to judicial custody till April 23 in Excise policy case
x

MLC Kavitha: ఇది సీబీఐ కస్టడీ కాదు.. బీజేపీ కస్టడీ

Highlights

MLC Kavitha: ఈ నెల 23 వరకు జ్యుడీషియల్ కస్టడీకి ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల 23 వరకు పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. కవితను 14 రోజుల పాటు కస్టడీకి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు సీబీఐ అధికారులు. అయితే 8 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి అనుమతిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ అధికారులు కవితను ప్రశ్నించనున్నారు.

ఇక ఎమ్మెల్సీ కవితను జైలుకు తరలించిన సందర్భంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఇది సీబీఐ కస్టడీ కాదని.. బీజేపీ కస్టడీ అంటూ కామెంట్స్ చేశారు కవిత. రెండేళ్లుగా అడిగిందే అడుగుతున్నారంటూ మాట్లాడారు. బయట బీజేపీ వాళ్లు మాట్లాడుతున్న మాటలనే.. లోపల సీబీఐ వాళ్లు అడుగుతున్నారని కామెంట్స్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories