మంత్రి భట్టి విక్రమార్కకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ

BRS MLC Kavitha Letter to Minister Bhatti Vikramarka
x

మంత్రి భట్టి విక్రమార్కకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ

Highlights

MLC Kavitha: ఈ బడ్జెట్‌లోనే బీసీ సంక్షేమానికి రూ.20 వేల కోట్లు కేటాయించాలి

MLC Kavitha: బీసీ సంక్షేమం కోసం 2024- 25 బడ్జెట్‌లో 20 వేల కోట్లు కేటాయించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంత్రి భట్టికి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సబ్ ప్లాన్‌కు చట్టబద్ధత కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ చేర్చిందని గుర్తు చేశారు. అంతేకాకుండా, బీసీ సంక్షేమానికి రానున్న ఐదేళ్లలో లక్షా కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చిందని, ఎంబీసీల సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని కూడా కాంగ్రెస్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిందని ప్రస్తావించారు.

అలాగే, ప్రతి జిల్లా కేంద్రంలో 50 కోట్ల వ్యయంతో ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్యత భవనాలను నిర్మిస్తామని కాంగ్రెస్ వాగ్దానం చేసిందని తెలిపారు. ఈ నేపథ్యంలో బీసీల సంక్షేమం కోసం ఈ ఆర్థిక సంవత్సరానికి గానూ బడ్జెట్‌లో 20 వేల కోట్లు కేటాయించాలని కోరారు. ఈ నిధుల కేటాయింపు ద్వారా కాంగ్రెస్ ఇచ్చిన హామీని నెరవేర్చినట్లవుతుందని, బీసీలు మరింత అభివృద్ధి చెందడానికి ఈ నిధులు దోహదపడతాయని అభిప్రాయపడ్డారు. బీసీల అభ్యున్నతి కోసం ప్రభుత్వం పనిచేయాలని, అందుకు బీసీలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలని స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories