టీడీపీ పూర్వవైభవం కోసమేనా?: చంద్రబాబుతో మల్లారెడ్డి, తీగల భేటి

BRS MLA Meets AP CM Chandrababu
x

టీడీపీ పూర్వవైభవం కోసమేనా?: చంద్రబాబుతో మల్లారెడ్డి, తీగల భేటి

Highlights

చంద్రబాబుతో మల్లారెడ్డి, తీగల భేటి

మాజీ మంత్రి సి. మల్లారెడ్డి,ఆయన అల్లుడు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తదితరులు సోమవారం ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడును కలిశారు. ఈ బేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.

టీడీపీకి పూర్వ వైభవం కోసమే కలిశాం: తీగల కృష్ణారెడ్డి

హైద్రాబాద్ సుందర నగరంగా తీర్చిదిద్దడంలో తాను మేయర్ గా కీలకపాత్ర పోషించినట్టుగా తీగల కృష్ణారెడ్డి చెప్పారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సైబరాబాద్ సిటీ ఏర్పడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దీన్ని ఎవరూ కాదనలేరు. బెస్ట్ సిటీ అవార్డు, బెస్ట్ టూరిజం అవార్డు కూడా హైద్రాబాద్ కు అప్పట్లో వచ్చాయని ఆయన గుర్తు చేసుకున్నారు. తెలంగాణ అంశం వచ్చి ఏం జరిగిందో మనమమంతా చూశాం.తెలంగాణలో టీడీపీకి మళ్లీ పూర్వవైభవం తెచ్చేందుకు మేమంతా చంద్రబాబును కలిసినట్టు తీగల కృష్ణారెడ్డి తెలిపారు. ఈ విషయమై మరోసారి మిమ్మల్ని పిలిచి మాట్లాడుతానని చంద్రబాబు చెప్పారని కృష్ణారెడ్డి తెలిపారు. ఎన్టీఆర్ అభిమానులను ఏకతాటిపైకి తీసుకువచ్చి టీడీపీని బలోపేతం చేస్తామన్నారు.

పెళ్లి పత్రిక ఇచ్చేందుకే: మల్లారెడ్డి

తన మనమరాలి పెళ్లి పత్రిక ఇచ్చేందుకు తాను ఏపీ సీఎం చంద్రబాబును కలిశానని మాజీ మంత్రి మల్లారెడ్డి చెప్పారు.టీడీపీలో మల్లారెడ్డి చేరుతారనే ప్రచారం సాగింది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడింది. తెలంగాణలో కూడా పార్టీని బలోపేతం చేస్తానని చంద్రబాబు ప్రకటించారు. ఇటీవల తెలంగాణకు చెందిన పార్టీ శ్రేణులతో ఆయన సమావేశమయ్యారు.ఈ సమావేశంలో పార్టీ బలోపేతంపై చర్చించారు. ఆ సమావేశం జరిగిన తర్వాత మల్లారెడ్డి టీడీపీలో చేరుతారనే ప్రచారం సాగింది. మల్లారెడ్డికి టీడీపీ తెలంగాణ రాష్ట్ర శాఖ కమిటీ అధ్యక్ష పదవిని కూడా ఇస్తారని ప్రచారం సాగింది. అంతకుముందు అంటే మార్చి నెలలో ఆయన కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం కూడా జరిగింది. కానీ,ఆయన బీఆర్ఎస్ లోనే ఉన్నారు. కానీ, ఇవాళ చంద్రబాబుతో మల్లారెడ్డి, తీగల కృష్ణారెడ్డి భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది.

మల్లారెడ్డి 2014 ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత కొంత కాలానికి ఆయన టీడీపీని వీడి బీఆర్ఎస్ లో చేరారు. 2018, 2023 ఎన్నికల్లో మేడ్చల్ అసెంబ్లీ స్థానం నుంచి ఆయన బీఆర్ఎస్ అభ్యర్ధిగా గెలిచారు. తీగల కృష్ణారెడ్డి సుదీర్ఘకాలం టీడీపీలో ఉన్నారు. 2014లో రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన టీడీపీని వీడి బీఆర్ఎస్ లో చేరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories