నేడు బీఆర్‌ఎస్‌ నేతల చలో మేడిగడ్డ యాత్ర

BRS Leaders Chalo Medigadda Yatra today
x

నేడు బీఆర్‌ఎస్‌ నేతల చలో మేడిగడ్డ యాత్ర

Highlights

Medigadda: కేటీఆర్‌ నేతృత్వంలో మేడిగడ్డను పరిశీలించనున్న నేతలు

Medigadda: ఛలో మేడిగడ్డకు బీఆర్‌ఎస్ సిద్ధమైంది. కాసేపట్లో తెలంగాణ భవన్ నుంచి బీఆర్‌ఎస్ నేతలు బయలుదేరనున్నారు. మేడిగడ్డ విజిట్ చేసే బృందంలో ఎమ్మేల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మాజీ ఎమ్మేల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, ముఖ్య నాయకులు ఉన్నారు. ఏడు బస్సుల్లో 150 మంది నేతలు మేడిగడ్డకు పయనంకానున్నారు. మధ్యాహ్నం భూపాలపల్లిలో లంచ్ చేయనున్నారు. సాయంత్రం మేడిగడ్డ వద్ద కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.

కాళేశ్వరంను ప్రభుత్వం విఫల ప్రాజెక్ట్‌గా చూపే కుట్రలు చేస్తోందని బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాళేశ్వరం అంటే ఒక్క బ్యారేజ్ మాత్రమే కాదని గులాబీ పార్టీ చెబుతోంది. కాళేశ్వరంపై ప్రజలకు వాస్తవాలు చెప్పడానికే చలో మేడిగడ్డ అని నేతలు అంటున్నారు. కుంగిన బ్యారేజ్‌కు మరమత్తులు చేసి నీటిని ఎత్తిపోయాలని డిమాండ్ చేస్తున్నారు. చలో మేడిగడ్డకు ఆటంకాలు లేకుండా బీఆర్ఎస్ జాగ్రత్త చర్యలు చేపట్టింది. ముందే మేడిగడ్డ టూర్ షెడ్యూల్, రూట్ మ్యాప్‌న డీజీపీకి నేతలు అందజేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories