BRS: బీఆర్ఎస్ దేశంలోనే రిచ్ ప్రాంతీయ పార్టీ.. టీడీపీ, వైసీపీల అకౌంట్లలో ఎంత డబ్బు ఉందంటే

BRS: బీఆర్ఎస్ దేశంలోనే రిచ్ ప్రాంతీయ పార్టీ.. టీడీపీ, వైసీపీల అకౌంట్లలో ఎంత డబ్బు ఉందంటే
x
Highlights

BRS: భారతదేశంలో ప్రస్తుతమున్న ప్రాంతీయ పార్టీల్లో అత్యంత ధనిక పార్టీ బీఆర్ఎస్ పార్టీ నిలిచింది. అన్ని ప్రాంతీయ పార్టీల కంటే ఖాతాలోనే ఎక్కువ డబ్బులతో...

BRS: భారతదేశంలో ప్రస్తుతమున్న ప్రాంతీయ పార్టీల్లో అత్యంత ధనిక పార్టీ బీఆర్ఎస్ పార్టీ నిలిచింది. అన్ని ప్రాంతీయ పార్టీల కంటే ఖాతాలోనే ఎక్కువ డబ్బులతో అగ్రస్థానంలో నిలిచింది. అన్ని ప్రాంతీయ పార్టీల కంటే బీఆర్ఎస్ పార్టీ ఖాతాలోనే ఎక్కువ డబ్బులతో టాప్ లో ఉంది. అయితే 2024లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో చేసిన ఖర్చులకు సంబంధించిన వివరాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఆడిట్ రిపోర్టును బీఆర్ఎస్ సమర్పించింది. పార్టీ సమర్పించిన రిపోర్టు ప్రకారం..బీఆర్ఎస్ ఖాతాతో ప్రస్తుతం ఎన్నివేల కోట్లున్నాయో చూద్దాం.

బీఆర్ఎస్ ధనిక పార్టీ. దేశంలోని ప్రాంతీయ పార్టీల్లో అత్యంత ధనికపార్టీగా బీఆర్ఎస్ పార్టీ టాప్ లో నిలిచింది. అన్ని ప్రాంతీయ పార్టీల కంటే బీఆర్ఎస్ పార్టీ ఖాతాలోనే ఎక్కువ డబ్బులు ఉన్నాయంటూ..ఆపార్టీ ఖాతాలో ప్రస్తుతం ఎన్ని వేల కోట్లున్నాయన్నది ఎవరో చెప్పలేదు..స్వయంగా ఈ విషయాన్ని బీఆర్ఎస్ పార్టీనే వెలువరించింది. 2024 లోకసభ ఎన్నికల్లో పెట్టిన ఖర్చుల వివరాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ పార్టీ ఆడిట్ రిపోర్టును సమర్పించగా..దాన్ని ఎలక్షన్ కమిషన్ తాజాగా వెబ్ సైట్లో అప్ లోడ్ చేసింది. ఆ రిపోర్టు ప్రకారం..ప్రస్తుతం బీఆర్ఎస్ ఖాతాల్లో ఏకంగా రూ. 1,449 కోట్లు ఉన్నాయి.

రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన మూడోచిత్రం రికార్డు క్రియట్ చేసింది. అయితే ఈ సినిమా కలెక్షన్స్ కేవలం రూ. 1236కోట్లు మాత్రమే. కానీ బీఆర్ఎస్ మాత్రం ఆర్ఆర్ఆర్ సినిమా కలెక్షన్లు దాటేయడం ఆశ్యర్యాన్ని కలిగిస్తోంది.

ఇప్పటివరకు రూ. 625కోట్లతో ఒడిశాకు చెందిన బిజూ జనతాదళ్ పార్టీ టాప్ ప్లేసులో ఉంటుండేది. కానీ ఇప్పుడు ఆ పార్టీని కిందికి నెట్టి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ అగ్రస్థానంలో నిలిచింది. లోకసభ ఎన్నికలు ప్రారంభమయ్యే వరకు బీఆర్ఎస్ ఖాతాలో రూ. 1,519 కోట్లు ఉన్నాయి. ఎన్నికల ప్రకటన వెలువడిన రోజు నుంచి ముగిసే లోపు బీఆర్ఎస్ పార్టీకి రూ. 47, 56కోట్ల విరాళాలు వచ్చాయి.

అయితే లోకసభ ఎన్నికల ప్రచారంతోపాటు ఇతర కార్యక్రమాలకు బీఆర్ఎస్ పార్టీ మొత్తంగా రూ. 120కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు నివేదికలో తెలిపింది. పలు రకాల మాధ్యమాల్లో ప్రచారానికి రూ. 10.51కోట్లు ఖర్చు చేసింది. ప్రచార సామాగ్రికి రూ. 34.68కోట్లు, బహిరంగసభలు, ఊరేగంపులు, ర్యాలీలకు రూ. 20.37కోట్లు, ఇతర ప్రచారానికి రూ. 34.39కోట్ల ఖర్చు చేసినట్లు ఆడిట్ రిపోర్టులో బీఆర్ఎస్ స్పష్టం చేసింది.

ఇక తెలంగాణలోని 17లోకసభ స్థానాల అభ్యర్థులకు రూ. 95లక్షల చొప్పున మొత్తం రూ. 16.15కోట్లు డైరెక్టుగా చెక్, డీడీ రూపలో ఇచ్చినట్లు ఆడిట్ రిపోర్టులో బీఆర్ఎస్ వెల్లడించింది. అభ్యర్థుల నేరచరిత్రపై ప్రకటనల కోసం రూ. 73.17లక్షలు ఖర్చు చేసినట్లు తెలిపింది.

ఇతర ప్రాంతీయ పార్టీల్లో తమిళనాడులోని డీఎంకే అకౌంట్లో రూ. 338కోట్లు ఉండగా..సమాజ్ వాదీ పార్టీ ఖాతాలో రూ. 340కోట్లు, టీడీపీ ఖాతాలో రూ. 272కోట్లు, జేడీయూ కు రూ. 147కోట్లు ఉన్నాయి. వైసీపీకి మాత్రం కేవలం రూ. 27కోట్లు మాత్రమే ఉన్నాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories