Puvvada Ajay Kumar: ఖమ్మంలో జోరు.. పువ్వాడ హోరు..

BRS Election Campaign In Khammam City
x

Puvvada Ajay Kumar: ఖమ్మంలో జోరు.. పువ్వాడ హోరు..

Highlights

Puvvada Ajay Kumar: చెప్పులు కుట్టి చర్మకారుడి కాళ్లకు తొడిగిన పువ్వాడ అజయ్

Puvvada Ajay Kumar: ఖమ్మం నగరంలోని 45 డివిజన్ స్టేషన్ రోడ్, బొమ్మన సెంటర్, పాత బస్టాండ్ దగ్గర వ్యాపార సముదాయాల్లో ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ జోరుగా ప్రచారం నిర్వహించారు. అందరికీ అభివాదం చేస్తూ.. కారు స్టీరింగ్‌ను చేతులతో చూయిస్తూ.. కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. పాన్ షాపులో పాన్ కట్టి వినియోగదారుడికి ఇచ్చారు. టీ స్టాల్‌లో చాయ్ తయారు చేసి అందరినీ ఆకట్టకున్నారు. చెప్పులు కుట్టి.. వాటికి పాలిష్ చేసి చర్మకారుడి కాళ్లకు చెప్పులు తొడిగి అతడి అభిమానం సంపాదించుకున్నారు. అరటి పండ్లు అమ్మి చిరు వ్యాపారులకు ఎల్లవేళలా అండగా ఉంటానని పువ్వాడ భరోసా ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో మహిళలు, చిన్నారులు సెల్ఫీలు దిగుతూ ఉత్సాహం కనబరిచారు.

Show Full Article
Print Article
Next Story
More Stories