KTR: తెలంగాణలో వైద్య, ఆరోగ్య పరిస్థితులపై ముగ్గురి సభ్యులతో BRS కమిటీ

BRS Committee with three members on medical and health conditions in Telangana
x

KTR: తెలంగాణలో వైద్య, ఆరోగ్య పరిస్థితులపై ముగ్గురి సభ్యులతో BRS కమిటీ

Highlights

KTR: నిర్మాణాత్మకమైన సూచనలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందిస్తాం

KTR: తెలంగాణలో వైద్య, ఆరోగ్య పరిస్థితులపై ముగ్గురి సభ్యులతో కూడిన నిజ నిర్ధారణ కమిటీని నియమించింది బీఆర్‌ఎస్ పార్టీ. ఇందులో రాజయ్య, కల్వకుంట్ల సంజయ్, మెతుకు ఆనంద్ సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ గాంధీ ఆసుపత్రితో పాటు రాష్ట్రంలోని పలు ఆసుపత్రులను సందర్శించి అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసి నిర్మాణాత్మకమైన సూచనలతో కూడిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించనున్నట్లు కేటీఆర్ తెలిపారు.

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులపై కాంగ్రెస్ సర్కార్ చిన్నచూపు చూస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ట్రస్ట్ జీవోను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చెయ్యడం లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. వైద్యానికి డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడ్తున్నారని ఎక్స్ వేదికగా నిలదీశారు.

కాంగ్రెస్ మొండి వైఖరితో 20 లక్షల కుటుంబాలు ఇబ్బందులో ఉన్నారన్నారు. తక్షణమే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన జీవోను అమలు చేసి ఉద్యోగులకు ఉపశమనం కలిగించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులను కేసీఆర్ సర్కార్ కుటుంబ సభ్యుల్లా చూసుకుందన్నారు కేటీఆర్.


Show Full Article
Print Article
Next Story
More Stories