Nalgonda: ఇవాళ బీఆర్ఎస్ చలో నల్గొండ సభ.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ పాల్గొననున్న తొలి సభ

BRS Chief  KCR Chalo Nalgonda Public Meeting
x

Nalgonda: ఇవాళ బీఆర్ఎస్ చలో నల్గొండ సభ.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ పాల్గొననున్న తొలి సభ

Highlights

Nalgonda: నల్గొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ భారీ ఏర్పాట్లు

Nalgonda: తెలంగాణలో కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతను KRMBకు అప్పగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధపడిందనీ, దీనిపై తాము ఆందోళన చేయడంతో కాంగ్రెస్ మాట మార్చి, అప్పగించే ప్రతిపాదనను వెనక్కి తీసుకుందని బీఆర్ఎస్ అంటోంది. ఇదే అంశంతో లోక్‌సభ ఎన్నికలకు వెళ్లబోతోంది. దీంతో ఈ అంశాన్ని హైలెట్ చెయ్యాలనుకుంటూ ఇవాళ ఛలో నల్గొండ సభ నిర్వహించబోతోంది. దీనికి మాజీ సీఎం కేసీఆర్ వస్తున్నారు. ఆయన ప్రసంగం ఎలా ఉంటుందన్నది హాట్ టాపిక్ అవుతోంది.

KRMB అంశంపై నిన్న తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చింది. అయితే, నిన్న సభకు కేసీఆర్ రాలేదు. వచ్చి ఉంటే బాగుండేదనీ, ఇంతకంటే ముఖ్యమైన పని ఏముంటుందని ప్రభుత్వం ఫైర్ అయ్యింది. దీనిపై కూడా ప్రభుత్వం విమర్శలు చేస్తోంది. ఓడిపోయినా కేసీఆర్ దొరతనం ప్రవర్తన మారలేదని మండిపడుతోంది.

తాము అధికారంలో ఉన్నప్పుడు.. KRMBకి కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను అప్పగించలేదనీ, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అప్పగించబోయిందని బీఆర్ఎస్ అంటోంది. ఇలా ప్రాజెక్టులు అప్పగిస్తే, రైతులకు, రాష్ట్రానికీ ఎలాంటి అన్యాయం జరుగుతుందో ఇవాళ్టి సభలో వివరిస్తామని అంటోంది. అయితే, కాంగ్రెస్ మాత్రం తాము ప్రాజెక్టులను అప్పగించట్లేదనీ, లేనిపోని అసత్య ప్రచారం చేయద్దని అంటోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories