Andavelli: అందవెల్లి పెద్దవాగుపై కుంగిన వంతెన.. ఇబ్బందులు పడుతున్న 42 గ్రామాల ప్రజలు

Bridge Damaged At Andavelli Peddavagu
x

Andavelli: అందవెల్లి పెద్దవాగుపై కుంగిన వంతెన.. ఇబ్బందులు పడుతున్న 42 గ్రామాల ప్రజలు

Highlights

Andavelli: తెప్పలపై ప్రయాణిస్తున్న ప్రజలు.. తెప్పలో ప్రయాణిస్తూ గల్లంతైన రైతు

Andavelli: కొమురం భీం జిల్లాలోని అందవెల్లి పెద్దవాగుపై వంతెన కుంగిపోయింది. దీంతో 42 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందుపడుతున్నారు. దిక్కుతోచని స్థితిలో తెప్పలపై ప్రయాణం సాగిస్తున్నారు. బీబ్రా గ్రామానికి చెందిన రైతు మల్లయ్య సరుకులు కొనుగోలు చేసుకుని తిరిగి వస్తూ వాగులో గల్లంతయ్యాడు.. నిత్యం రైతులు, విద్యార్థులు ప్రమాదం అని తెలిసినా తెప్పలపై ప్రయాణం చేయాల్సి వస్తుందన్నారు.

కొమురం భీం జిల్లా కాగజ్‌నగర్ నుంచి దహెగాం వెళ్లే మార్గంలో అందవెళ్లి సమీపంలోని వంతెన గత సంవత్సరం కురిసిన భారీ వర్షాలకు కుంగి పోయింది. కొద్ది రోజుల కిందట మరింతగా కుంగింది స్లాబులు పిల్లర్లను తొలగించారు. దీంతో వంతెనపై నుంచి వాహనాల రాకపోకలను అధికారులు నిలిపి వేశారు. వేసవికాలంలో వాగులో తాత్కాలిక వంతెన ద్వారా రాకపోకలు సాగించారు ఇప్పుడు వర్షాల కారణంగా గ్రామాల ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. దాదాపు 42 గ్రామాల ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.

ప్రతిరోజు వివిధ పనులపై కాగజ్ నగర్ పట్టణానికి వచ్చే ప్రజలు ఎన్నో వ్యయప్రయాసలకు గురవుతున్నారు. కాగజ్ నగర్ నుంచి దహెగాం మండల కేంద్రానికి వెళ్లాలంటే రెండు ఆటోలు మార్చాల్సి వస్తోందని ప్రయాణికులు అంటున్నారు. ఆటోను ఎంగేజ్ చేసుకుంటే ఆరు వందల రూపాయలు ఖర్చు అవుతుందని చెబుతున్నారు. ఇక వైద్య సేవలు లేని మారుమూల గ్రామ ప్రజలు మరో మార్గంలో వెళ్లాలంటే 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించవలసి వస్తోంది.

ఈ నేపథ్యంలోనే అందవెల్లి వంతెన ప్రాంతంలో కొందరు తెప్పల ద్వారా ప్రజలను దాటి అవతలి గట్టుకు దాటిస్తున్నారు. ఇటు కాగజ్ నగర్ వైపు, అటు దహెగాం వైపు వెళ్లే ప్రయాణికులు తెప్పల ద్వారానే వెళున్నారు. ప్రమాదమని తెలిసినా తప్పడం లేదని పలువురు ప్రయాణికులు స్పష్టం చేస్తున్నారు. ఈ వంతెన పూర్తైతే తప్ప తమ కష్టాలు తీరవని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఆ వంతెన ఇప్పట్లో పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదని స్థానికులు చెబుతున్నారు. స్టీమర్స్, ఎయిర్ బోట్స్ లాంటివి అధికారులు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు...

అసలు అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ బ్రిడ్జి కూలిపోయిందని ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఎండాకాలంలో పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా సాగిందంటున్నారు.. ఇసుక దొంగలు వంతెన పిల్లర్ వద్దే తవ్వకాలు చేసి ఇసుకను అక్రమరవాణా చేశారంటున్నారు. . ఇష్టారాజ్యంగా ఇసుక తరలింపు నేపథ్యంలోనే పిల్లర్ భూమిలోకి కుంగిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories