bridegroom get Compensation : వరుడికి పరిహారం చెల్లించిన దుస్తుల షాపు యజమాని

bridegroom get Compensation :  వరుడికి పరిహారం చెల్లించిన దుస్తుల షాపు యజమాని
x
ప్రతీకాత్మక చిత్రం
Highlights

bridegroom get Compensation : పెళ్లిళ్లు, ఫంక్షన్లలో వధువు, వరుడు నలుగురిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలవాలని చూస్తారు. అందుకోసం ఆకర్షనీయంగా కనిపించే...

bridegroom get Compensation : పెళ్లిళ్లు, ఫంక్షన్లలో వధువు, వరుడు నలుగురిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలవాలని చూస్తారు. అందుకోసం ఆకర్షనీయంగా కనిపించే విధంగా తయారవుతారు. వేలాది రూపాయలు ఖర్చు చేసి ప్రత్యేకమైన దుస్తులను కొనుగోలు చేసి ధరిస్తారు. దీంతో పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు అని వారిని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈ క్రమంలోనే పెళ్లి కొడుకు కోసం అతడి బంధువు వేలాది రూపాయలు ఖర్చు చేసి షేర్వానీ కొనుగోలు చేశాడు. చూస్తే ఎంతో అందంగా కనిపించిన ఆ షేర్వానీ పెళ్లి సమయంలో తొడుక్కోగానే చిరిగిపోయింది. దీంతో పెళ్లికి వచ్చిన బంధువుల ముందు అతని పరువు పోయింది. అది సహించని ఆ వరుడు వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించి భారీ పరిహారం పొందాడు.

ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్‌ లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన పూర్తివివరాల్లోకెళితే నగరంలోని బంజారాహిల్స్‌కు చెందిన కిషోర్ రాయ్ అనే వ్యక్తి తన బంధువుల ఇంట్లో జరిగే పెళ్లి వేడుక కోసం షాపింగ్ చేసాడు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 4లోని ఓ వస్త్ర దుకాణంలో ఐదు రకాల దుస్తులతో పాటు ఓ మంచి షేర్వానీ కూడా కొనుగోలు చేశాడు. ఈ దుస్తులన్నింటికీ రూ.83 వేలు బిల్లయ్యింది. డబ్బులు పోతే పోయాయి కానీ అందరిలో ఆకర్షనీయంగా ఉండేట్టు ఫ్యాషనబుల్‌గా ఉంటాయి కదా అని భావించాడు. పెళ్లి సమయం కోసం ఎదురు చూసాడు. తీరా పెళ్లి వేడుకల్లో వరుడు ఆ దుస్తుల్ని ధరించగా.. అది భుజం దగ్గర చిరిగిపోయింది.

దీంతో బంధువుల ముందు వరుని పరువు పోవడంతో నామోషీగా భావించాడు. షేర్వానీ కారణంగా అంతమందిలో పరువు పోయిందని ఆరోపిస్తూ దాన్ని విక్రయించిన షాపును ఫోరానికి ఈడ్చాడు. ఈ కేసును విచారించిన జిల్లా కమిషన్-3 బాధితుడి వాదనతో ఏకీభవించింది. దుస్తుల కొనుగోలుకు కోసం చెల్లించిన రూ.83,000తో తిరిగి చెల్లించడంతో పాటు పరిహారంగా మరో రూ.50 వేలు ఇవ్వాలని ఆదేశించింది. అంతే కాదు కేసుల ఖర్చుల నిమిత్తం మరో రూ.5 వేలు ఎక్కువ నగదును చెల్లించాలని ఈ మొత్తాన్ని 45 రోజుల వ్యవధిలో చెల్లించాలని ఆదేశించింది.



Show Full Article
Print Article
Next Story
More Stories