Bowenpally Kidnap: తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన బోయిన్‌పల్లి కిడ్నాప్‌

Bowenpally Kidnap
x
Highlights

Bowenpally కిడ్నప్: రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ మాజీ...

Bowenpally కిడ్నప్: రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత భూమా అఖిలప్రియ అరెస్టయిన ఈ వ్యవహారంలో. ఆమె ప్రత్యర్థి ఏవీ సుబ్బారెడ్డి కీలక నిందితుడని తేలింది. కొన్నాళ్లుగా నిప్పూఉప్పులా పోట్లాడుకుంటోన్న అఖిల-ఏవీలు భూదందాలను మాత్రం కలిసే చేస్తున్నారా? అనే అనుమానాలకు తావిచ్చేలా హైదరాబాద్ పోలీసులు కీలక విషయాలను బయటపెట్టారు.

టీడీపీ కీలక నేత, ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్టు వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. సంచలనాత్మక 'బోయినపల్లి కిడ్నాప్'(Bowenpally Kidnap) వ్యవహారంలో అఖిలప్రియ ప్రమేయంపై ప్రాధమిక ఆధారాలు లభించడంతో ఆమెను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. కిడ్నాప్ కేసులో అరెస్టు తర్వాత అఖిలప్రియను బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విచారణ అనంతరం గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. గాంధీ ఆస్పత్రిలో అఖిలప్రియకు వైద్యపరీక్షలు చేశారు. ఆ తర్వాత సికింద్రాబాద్ జడ్జి క్వార్టర్స్‌లో.. న్యాయమూర్తి ఎదుట అఖిల ప్రియను హాజరుపరిచారు. కోర్టు ఆమెకు 14 రోజుల రిమాండ్‌ విధించింది. న్యాయమూర్తి ఆదేశాల అనుసారం.. పోలీసులు అఖిల ప్రియను చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఇవాళ అఖిల ప్రియ బెయిల్ పిటిషన్‌పై కోర్టులో విచారణ జరగనుంది.

కిడ్నాప్‌ వ్యవహారంలో ఏ1 నిందితుడు ఏవీ సుబ్బారెడ్డిని హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే బోయిన్‌పల్లి కిడ్నాప్ ఘటనతో తనకెలాంటి సంబంధం లేదన్నారు ఏవీ సుబ్బారెడ్డి. కిడ్నాప్‌ చేయించింది అఖిలప్రియ, భార్గవ్‌రామేనని పోలీసులు తేల్చారని అన్నారు. అయితే, పోలీస్ కమిషనర్ తనను ఏ1గా ఎందుకు చెప్పారో అర్థం కావడం లేదన్నారు.

ఇక హఫీజ్‌ పేట ల్యాండ్‌ వివాదం(Bowenpally Kidnap) చాలా రోజుల నుంచి కొనసాగుతుందని సుబ్బారెడ్డి తెలిపారు. భూమా రెడ్డి చనిపోయిన తర్వాత ఆ ల్యాండ్‌ వ్యవహారంలో తల దూర్చలేదన్నారు. అఖిల ప్రియకు తనకు మధ్య మాటలు లేవని తెలిపారు. 41CRPC కింద నోటీసులు జారీ చేసిన పోలీసులు... ఏవీ సుబ్బారెడ్డిని మరోసారి విచారణ చేసి స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేయనున్నారు.

కేసుతో సంబంధం ఉందో లేదో.. ఎంక్వైరీలో తేలుతుందని అఖిల ప్రియ చెల్లెలు మౌనికరెడ్డి అన్నారు. వేరే రాష్ట్రం నుంచి వస్తే ఇక్కడ బ్రతకనివ్వరా అని ప్రశ్నించారు. తప్పు చేస్తే విచారణ చేయాలి కానీ.. ఉదేశ్యపూర్వకంగా ఇలా చేయడం సరికాదన్నారు. ప్రవీణ్‌రావు కేసీఆర్ బంధువు కాబట్టి.. ఈ రకంగా దాడులు చేయడం కరెక్ట్‌కాదన్నారు. ఏం చేస్తారోనన్న భయంతోనే భార్గవ్‌రామ్‌ అజ్ఞాతంలోకి వెళ్లారన్నారు. ఇక భూ వివాదానికి సంబంధించిన అంశంపై ప్రవీణ్‌ కుటుంబంతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నామని మౌనికరెడ్డి అన్నారు.

నంద్యాలలో నిప్పూ-ఉప్పులా పోట్లాడుకుంటోన్న ఏవీసుబ్బారెడ్డి-భూమా కుటుంబాలు హఫీజ్ పేట్ భూవ్యవహారంలో క‌లిసిపోయాయా? రెండు వర్గాలూ కలిసికట్టుగానే కిడ్నాప్ కు స్కెచ్ వేశాయా? అనే చర్చ నడుస్తోంది. చూడాలి ఈ కేసులో ఇంకా ఎలాంటి విషయాలు బయటకు వస్తాయో.

Show Full Article
Print Article
Next Story
More Stories