Bogatha Waterfall: భారీ వర్షాలతో ప‌ర‌వ‌ళ్లు తొక్కుతున్న బొగత జలపాతం

Bogatha Waterfall in Full Flow
x

Bogatha Waterfall: భారీ వర్షాలతో ప‌ర‌వ‌ళ్లు తొక్కుతున్న బొగత జలపాతం

Highlights

Bogatha Waterfall: తెలంగాణ నయాగరా జలపాతంగా ప్రసిద్ది చెందిన బొగత జలపాతం పొంగి పొర్లుతుంది.

Bogatha Waterfall: తెలంగాణ నయాగరా జలపాతంగా ప్రసిద్ది చెందిన బొగత జలపాతం పొంగి పొర్లుతుంది. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌లో కురిసిన భారీ వర్షాలకు వాగులు.. వంకల నుంచి నీరు ప్రవహిస్తూ బొగత జలపాతం హోయలొలుకుతుంది. అడవి ప్రాంతంలోని కొండ కోనల నుంచి నీళ్లు జాలువారుతున్నాయి. 50 అడుగుల ఎత్తుతో జలపాతం పరవళ్లు తొక్కుతోంది. కొంత కాలం క్రితం వరకు నీళ్లు లేక వెలవెలబోయిన జలపాతంలోకి వరద నీరు చేరడడంతో ఆకట్టుకుంటుంది.

బొగత వాటర్ ఫాల్స్ అందాలను తిలకించేందుకు పర్యాటకులు పోటీ పడుతున్నారు. జలపాతాల వద్ద తినివితీరా ఎంజాయ్ చేస్తున్నారు. ఎంత దూరం ప్రయాణం చేసినా కనిపిస్తున్న ఈ జలపాతాలు ఆ అలసట మరిచిపోయి తన్మయత్వంతో ఉప్పొంగిపోతున్నారు. వరద ఉదృతి పెరుగుతుండటంతో జలపాతల సందర్శనకు వచ్చే పర్యాటకులు తగు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories