Boga Shravani: మున్సిపల్ ఛైర్ పర్సన్ పదవికి బోగ శ్రావణి రాజీనామా

Boga Shravani Resigned From The Post Of Municipal Chair Person
x

Boga Shravani: మున్సిపల్ ఛైర్ పర్సన్ పదవికి బోగ శ్రావణి రాజీనామా

Highlights

Boga Shravani: జగిత్యాలలో రాజకీయ పరిణామాలు

Boga Shravani: జగిత్యాల నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి మున్సిపల్ చైర్మన్ ఎమ్మెల్యే టికెట్ కోసం పావులు కదిపారని ప్రచారం జరుగుతుంటే బిసి నినాదం తో చైర్ పర్సన్ రాజీనామా మరో సంచలనానికి తెరేలేపింది. జగిత్యాల BRS నాయకుల మధ్య స్పర్థలు పార్టీ ప్రతిష్టను మసకబారుస్తున్నారని పార్టీ శ్రేణులు మదనపడుతున్నాయి.

నిన్న మొన్నటి వరకు అంతర్గతంగా ఉన్న విభేదాలు భగ్గుమన్నాయి. మున్సిపల్ ఛైర్ పర్సన్ బోగ శ్రావణి పదవికి రాజీనామా చేయడం, ఎమ్మెల్యే అవమానించారని కన్నీరు పెట్టడం సంచలనంగా మారింది. అయితే ఇదంతా వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసమే అనే చర్చ జరుగుతోంది.. బోగ శ్రావణి దంపతులు రహస్యంగా BRS తరఫున ఎన్నికల బరిలో దిగాలని ప్రయత్నిస్తు్న్నట్లు సమాచారం. జగిత్యాలలో రాజకీయ పరిణామాలు, అనుచరులతో బలాబలాలపై చర్చలు చేస్తున్నారనే ప్రచారం జరిగింది.. చైర్ పర్సన్ శ్రావణి రాజకీయ ప్రయాణాలు పసి గట్టిన ఎమ్మెల్యే సంజయ్ ఆదిలోనే ఆమెకు చెక్ పెట్టేందుకు తన అనుకూల కౌన్సిలర్లుతో లేక రాపించి నట్లు చర్చ నడుస్తోంది..

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రావణి మధ్య గత కొంతకాలంగా అంతర్గత విభేదాలు నెలకొన్నాయి. మున్సిపల్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలలో మున్సిపల్ చైర్ పర్సన్ శ్రావణిని పట్టించుకోకుండా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పక్కన బెడుతున్నారని చైర్ పర్సన్ శ్రావణి మదనపడుతున్నారు.

ఇదే సమయంలో మాస్టర్ ఫ్లాన్ వివాదం తెరపైకి రావడం ప్రజలకు అవగాహన కల్పించలేకపోవడం రైతులకు ముసాయిదా గురించి చెప్పడంలో చైర్ పర్సన్ విఫలం అయిందని కొంత మంది కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తంచేశారు. మరో వైపు ఆరునెలలుగా శ్రావణి టికెట్ రేసులో ఉందంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం అవ్వడం ఎమ్మెల్యే కు ఇబ్బందిగా మారిందనే మాట రాజకీయంగా చర్చనీయాంశమైంది.

జగిత్యాల ఎన్నికల బరిలో శ్రావణి దిగబోతున్నారని జరుగుతున్న ప్రచారానికి తగ్గట్టు ..,సామజిక వర్గ కోణం లోనూ సమీకరణాలు కలిసి వచ్చాయి ...జగిత్యాల సెగ్మేంట్ లో పద్మశాలి సామాజిక వర్గ ఓట్లు కీలకంగా ఉన్నాయి. 20 వేలు నుండి 30 వేలు వరకూ ఓట్లు ఉన్నాయి..చైర్ పర్సన్ శ్రావణి పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడంతో ఈచర్చ మరింత ఊపందుకుంది గతంలో జగిత్యాలలో ఎల్ రమణ బిసి సెంటి మెంట్ తోనే గెలిచారు. ఇప్పుడు శ్రావణి కూడా బిసి నినాదాన్ని తెరపైకి తెచ్చి గెలవాలని ప్రయత్నిస్తోందనే వాదన తెర మీదకి తీసుకొచ్చారు. దీంతో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ శ్రావణిల మధ్య గ్యాప్ మరింత పెరిగింది.

గత నాలుగు రోజుల క్రితం 27 మంది కౌన్సిలర్లు బోగ శ్రావణి మున్సిపల్ చైర్ పర్సన్ గా పదవినుంచి తప్పించాలనే ఉద్ధేశంతో ఎమ్మెల్యే సంజయ్ కు లేఖ రాయడం ...ఆ తరువాత రాజీనామా దాక వచ్చిన పరిణామాలు చోటుచేసుకున్నాయి. బోగ శ్రావణి రాజీనామా తరువాత బీజేపీకి అనుకూలంగా సోషల్ మీడియాలో డ్రైవ్ చేయడం జగిత్యాల పాలిటిక్స్ మరింత ఆసక్తిగా మారాయి.

జగిత్యాలలో రాజకీయ పరిణామాలను గమనించిన మున్సిపల్ కౌన్సిలర్లు శ్రావణి తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్టీ మారాలనే ఉద్ధేశంతో బీసీ నినాదాన్ని వెలుగులోకి తీసుకురావడం, ఎమ్మెల్యేపై అభియోగాలు మోపడం, బీఆర్ఎస్ పార్టీకి డ్యామేజి చేసేవిధంగా శ్రావణి వ్యవహరిస్తోందని కౌన్సిలర్లు మండిపడ్డారు. రోజు రోజుకి మలుపు తిరుగుతున్న జగిత్యాల పాలిటిక్స్ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనని ఆసక్తి నెలకొంది.




Show Full Article
Print Article
Next Story
More Stories