Formula E Car Race Case: విచారణకు గైర్హాజర్, సమయం కోరిన బీఎల్ఎన్ రెడ్డి

Formula E Car Race Case: విచారణకు గైర్హాజర్, సమయం కోరిన బీఎల్ఎన్ రెడ్డి
x
Highlights

ఫార్ములా-ఈ కారు రేసు కేసులో(Formula E Car Race Case) విచారణకు హాజరుకావడానికి తనకు మరింత సమయం కావాలని హెచ్ఎండీఏ (HMDA ) రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి...

ఫార్ములా-ఈ కారు రేసు కేసులో(Formula E Car Race Case) విచారణకు హాజరుకావడానికి తనకు మరింత సమయం కావాలని హెచ్ఎండీఏ (HMDA ) రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి (BLN Reddy) ఈడీ (ED) ఎన్ ఫోర్స్ మెంట్ జాయింట్ డైరెక్టర్ కు గురువారం మెయిల్ పంపారు. ఈమెయిల్ కు ఈడీ అధికారులు కూడా సానుకూలంగా స్పందించారు. మరోసారి విచారణకు పిలుస్తామని చెప్పారు.

2023 డిసెంబర్ 28న ఈడీ విచారణకు రావాలని మున్సిపల్ శాఖ మాజీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్(Arvind Kumar), హెచ్ఎండీఏ రిటైర్డ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి , మాజీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ (KTR) ను విచారణకు రావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది.

జనవరి 2న బీఎల్ఎన్ రెడ్డి, జనవరి 3న అరవింద్ కుమార్, జనవరి 7న కేటీఆర్ ను విచారించాలని ఈడీ ప్లాన్ చేసింది. ఇవాళ ఈడీ విచారణకు బీఎల్ఎన్ రెడ్డి హాజరు కాలేదు. దీంతో రేపు అరవింద్ కుమార్, ఈ నెల 7 న కేటీఆర్ విచారణకు హాజరౌతారా అనేది చర్చకు దారి తీసింది. తమ న్యాయవాదుల నిర్ణయం మేమరకు ఈడీ విచారణకు హాజరు కావాలో లేదో నిర్ణయం తీసుకొంటానని కేటీఆర్ ఈ నెల 1నమీడియాతో కేటీఆర్ చెప్పారు.

అసలు అవినీతే జరగనప్పుడు అవినీతి నిరోధక చట్టం కింద ఎలా కేసు నమోదు చేస్తారని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. ఇదే వాదనలను ఆయన తరపు న్యాయవాదులు కోర్టులో వినిపించారు. అయితే ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించారని ప్రభుత్వం తరపు న్యాయవాదులు చెబుతున్నారు. ఎఫ్ఈఓకు నిధుల బదలాయింపు సమయంలో ఆర్ బీ ఐ అనుమతి తీసుకోకపోవడం, అప్పట్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా ఈసీ అనుమతి తీసుకోని విషయాన్ని ప్రభుత్వం గుర్తు చేస్తోంది.

ఫార్మూలా ఈ కారు రేసు కేసులో 2023 డిసెంబర్ 20న ఈడీ కేసు నమోదు చేసింది. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు పెట్టింది. మనీలాండరింగ్ చట్టాల కింద కేసులు నమోదు చేశారు.గత ఏడాది డిసెంబర్ 19న ఏసీబీ కేటీఆర్ పై కేసు నమోదు చేసింది. ఈ కేసును కొట్టివేయాలని తెలంగాణ హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. అయితే తీర్పు వెలువర్చేవరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కూడా ఆదేశించింది. అయితే అదే సమయంలో విచారణకు సహకరించాలని కోర్టు కోరింది.



Show Full Article
Print Article
Next Story
More Stories