కాషాయం కండువా కప్పుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారా.?

కాషాయం కండువా కప్పుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారా.?
x
Highlights

బీజేపీ ఆపరేషన్ ఆకర్ష తెలంగాణాలో ప్రారంభించినట్టు కనిపిస్తోంది. పలువురు నాయకులు బీజేపీలో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది.

తెలంగాణలో పాగ వేసేందుకు బీజేపీ వడివడిగా అడుగులు వేస్తోంది. దుబ్బాక ఉపఎన్నికపై బీజేపీ భారీగా అంచనాలు పెంచుకుంది. ఫలితం వచ్చాక అన్నిదారులు బీజేపీవైపే అని ప్రచారం చేస్తోంది. ఏకంగా ఆకర్ష్ పథాకాన్ని తెరపైకి తీసుకువచ్చింది. పార్టీలో చేరవొచ్చని బంపర్‌ ఆఫర్ కూడా ప్రకటించింది. మరీ బీజేపీ ఇచ్చిన ఆఫర్‌కు ఎవరైనా తలొగ్గుతున్నారా..? కాషాయం కండువా కప్పుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారా.?

తెలంగాణలో కాషాయం జెండా ఎగురవేసేందుకు బీజేపీ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. రాష్ట్రంలో కాంగెస్‌ ఢీలా పడిపోతోందని, అధికార పార్టీని ఢీకొట్టాలంటే బీజేపీకే సాధ్యమని ప్రచారం జరుగుతోంది. ఇలా ఎన్నో క్వాలిటీస్‌తో బీజేపీ ఆకర్ష్ పథకానికి పదును పెట్టింది. నిన్న కంటోన్మెంట్ వైస్ చైర్మన్ రామకృష్ణ, నేడు మైలార్ దేవర్ పల్లి కార్పొరేటర్ శ్రీనివాస్ బీజేపీ కండువా కప్పుకున్నారు. ఇక దుబ్బాక ఫలితం తర్వాత చాలా మంది బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

దుబ్బాక ఉపఎన్నిక ఫలితం తర్వాత ఆపరేషన్ ఆకర్ష్‌కు ముహూర్తం ఖారారు చేయనున్నట్లు తెలుస్తోంది. దుబ్బాక ఫలితం వచ్చిన మరుసటి రోజే రాములమ్మకు కాషాయం కండువా కప్పాలని పార్టీ నేతల డిసైడైనట్లు తెలుస్తోంది. విజయశాంతి ద్వారానే ఆకర్ష్ పథకానికి శ్రీకారం చుడతారని పార్టీల్లో చర్చజరుగుతోంది. పైగా చాలా మంది కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు బీజేపీ నేతలతో టచ్‌లో ఉంటున్నారు.

గ్రేటర్ హైదరాబాద్‌లో మాజీ మేయర్, మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి కూడా బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీ ఆయనను నెగ్టెట్ చేస్తోంది. అందుకే ఆయన బీజేపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ మంత్రి కుటుంబం కూడా బీజేపీతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

ఇక కుత్భుల్లాపూర్ నియోజకవర్గంలో కాసాని జ్ణానేశ్వర్ ముదిరాజ్ సైతం బీజేపీలో చేరేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఆయన కుమారుడు వీరేష్ ముదిరాజ్ గత సాధరణ ఎన్నికల సమయంలో బీజేపీలో చేరినట్లే చేరి చివరి క్షణంలో కాంగ్రెస్‌లోని ఉండిపోయారు. దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ జాక్‌పాట్ కొట్టేందుకు తహతహలాడుతోంది. దీంతో బీజేపీలో చేరేందుకు ఇతర పార్టీల నుంచి చాలా మంది నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇన్ని పరిణామాల మధ్య బీజేపీ కాంగ్రెస్‌ను ఖతం చేసి, అధికార పార్టీని ఎలా గద్దె దింపుతుందో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories