హడావిడి చేసి హఠాత్తుగా వెనక్కి తగ్గిన హస్తం..ఎన్నికల ప్రచారంలో ముందున్న కాషాయదళం

హడావిడి చేసి హఠాత్తుగా వెనక్కి తగ్గిన హస్తం..ఎన్నికల ప్రచారంలో ముందున్న కాషాయదళం
x

హడావిడి చేసి హఠాత్తుగా వెనక్కి తగ్గిన హస్తం..ఎన్నికల ప్రచారంలో ముందున్న కాషాయదళం


Highlights

కాంగ్రెస్ పార్టీ... ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంపై ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. అన్ని పార్టీలు ప్రకటించిన తర్వాతే అభ్యర్థి ఎవరో చెప్పాలన్నది హస్తం పార్టీ...

కాంగ్రెస్ పార్టీ... ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంపై ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. అన్ని పార్టీలు ప్రకటించిన తర్వాతే అభ్యర్థి ఎవరో చెప్పాలన్నది హస్తం పార్టీ ఆలోచనగా కనిపిస్తోంది. హైదరాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి నుంచి చిన్నారెడ్డి, వరంగల్, ఖమ్మం, నల్గొండ నుంచి రాములునాయక్ పేర్లు దాదాపు ఖరారు అయిందని ప్రచారం జరిగినా ఇన్‌ఛార్జి టూర్‌తో సీను మారిందన్న చర్చ కూడా నడుస్తోంది. అటు- బీజేపీలో మాత్రం ఎక్కడ లేని ధీమా కనిపిస్తోంది. అందరికంటే ముందే అభ్యర్థులను ప్రకటించి ప్రచారాన్ని జోరుగా నిర్వహిస్తోంది. ఇంతకీ రెండు పార్టీల వ్యూహం ఏంటి?

రెండు స్థానాలకు అభ్యర్థుల ప్రకటనపై హస్తం పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. అందరికంటే ముందుగానే ప్రకటిస్తామని హడావిడి చేసినా హఠాత్తుగా వెనుకడుగు వేయడంలో ఆంతర్యం ఏమిటన్న చర్చ నడుస్తోంది. ఇన్‌చార్జ్ ఠాగూర్ ముందు సీనియర్లు ఉంచిన ఓ ప్రతిపాదన వల్ల ఎంపిక కమిటీని నియమించాల్సి వచ్చిందన్న ప్రచారం జరుగుతోంది. తెలంగాణ జన సమితి నుంచి కోదండరామ్‌ పోటీ చేస్తుండడంతో ఆయనకు మద్దతు ఇవ్వాలని కొందరు పార్టీ నేతలు ప్రతిపాదించారట. కోదండకు బయట నుంచి మద్దతు ఇచ్చి గెలిపించాలన్న ఆలోచనలో ఉన్న హస్తం పార్టీలోని కొందరు నేతలు ఇప్పటికే ప్రతిపాదించిన రాములునాయక్‌ను బుజ్జగించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఏ నిర్ణయమైనా కమిటీలో చర్చించే నిర్ణయం ప్రకటిస్తామని చెబుతున్నారు.

అటు- భారతీయ జనతా పార్టీ పట్టభద్రుల ఎన్నికల కోసం దూకుడు పెంచింది. కమలం పార్టీకి అదనపు బలంగా సంఘం మద్దతు ఉండడంతో అందరికంటే ముందుగానే దూసుకుపోతుంది. పట్టభద్రుల ఓటరు నమోదులో అన్ని పార్టీల కంటే అన్ని గ్రామ కమిటీల సమావేశం నిర్వహించి పట్టభద్రులను ఓటరు నమోదులో వారి వద్దకు వెళ్లీ ఓటు నమోదు చేయించింది. గ్రామ కమిటై, మండల కమిటీలతో సహా అందర్ని క్రీయాశీలం చేసి ఓటర్ల నమోదు అత్యధిక సంఖ్యలో చేయించి గెలుపుపై కమలం పార్టీ మరింత ధీమాగా కనిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్సీ రామ్‌చందర్‌రావును మళ్లీ రంగంలోకి దించిన బీజేపీ వరంగల్ స్థానంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డిని దాదాపుగా ఖరారు చేసింది. ఇద్దరు అభ్యర్థులకు సంఘం మద్దతు ఉండడంతో గెలుపు నల్లేరుపై నడకే అని కమలం పార్టీ అంచనా వేస్తోంది.

రెండు జాతీయ పార్టీలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలంగా పోరాడడానికి సిద్ధమైనా స్వతంత్రుల నుంచి పోటీ తప్పేలా లేదు. మహబూబ్‌నగర్ పట్టభద్రుల స్థానంలో రెండు ప్రధాన పార్టీలు గట్టి పోటీనిస్తున్నా వరంగల్ స్థానంలో మాత్రం ఇండిపెండెంట్లు చక్కలు చూపించే అవకాశం ఉందన్న విశ్లేషణలు ఉన్నాయి. మరి ఈ పరిస్థితుల్లో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories