మరో సాహసానికి కాషాయ పార్టీ సిద్దమవుతోందా? ముఖ్యమంత్రి అభ్యర్థిగా..

BJP Political Strategy On Etela Rajender
x

మరో సాహసానికి కాషాయ పార్టీ సిద్దమవుతోందా? ముఖ్యమంత్రి అభ్యర్థిగా..

Highlights

Etela Rajender: హుజూరాబాద్‌ ఫలితాన్ని బట్టి, మరో సాహసానికి కాషాయ పార్టీ సిద్దమవుతోందా?

Etela Rajender: హుజూరాబాద్‌ ఫలితాన్ని బట్టి, మరో సాహసానికి కాషాయ పార్టీ సిద్దమవుతోందా? పశ్చిమ బెంగాల్, నార్త్‌ ఈస్ట్ స్టేట్స్‌ తరహాలో, తెలంగాణలోనూ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టబోతోందా? అందుకే ఈటల రాజేందర్‌ నుంచి అలాంటి పలుకులు ఉరకలేస్తున్నాయా? ఇంతకీ హుజూరాబాద్‌ రిజల్ట్‌ను బట్టి కమలం వ్యూహం ఏంటి?

తెలంగాణలో బీజేపీ కొత్తకొత్త ఎత్తులు వేస్తోంది. ఎలాగైనా టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయ ఫోర్స్‌గా ఎదిగి, వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని చేపట్టాలని ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగా హుజూరాబాద్‌ ఉప ఎన్నికను ఎత్తుగడగా భావిస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హుజూరాబాద్ బైపోల్‌పైనే అందరి దృష్టిపడింది. ఎలాగైనా గెలవాలని టీఆర్ఎస్‌‌ రకరకాల వ్యూహాలు, ఎత్తుగడలు వేస్తోంది. ఇందులో గెలిచి జనంలోకి ఒక సంకేతం పంపాలనుకుంటోంది. టీఆర్ఎస్‌కు దీటైన ప్రత్యర్థి తామేనని చెప్పాలనుకుంటోంది. హుజూరాబాద్‌లో గెలిస్తే, మరో సాహసోపేత ప్రయోగానికి శ్రీకారం చుట్టాలనుకుంటున్నారు అమిత్‌ షా.

హుజూరాబాద్‌లో బీజేపీ గెలిస్తే, ఈటల రాజేందర్‌ను మరింతగా ఫోకస్ చెయ్యాలన్నది బీజేపీ ప్లాన్. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎస్టాబ్లిష్‌‌ చేసేందుకు ఉవ్విళ్లూరుతోంది. కేసీఆర్‌కు దీటైన నేతగా జనం ముందుపెట్టాలనుకుంటోందట. రాష్ట్రమంతా ఆయనను తిప్పి, కేసీఆర్‌‌పై ఇంతెత్తున విమర్శలు చేయించాలని భావిస్తోందట. బీజేపీ ఈ దిశగా సంకేతాలు ఇచ్చినందుకే, ఈమధ్య ఈటల రాజేందర్‌ ఇదే తీరులో స్వరం పెంచుతున్నారని కొందరు మాట్లాడుకుంటున్నారు. తాను గెలిస్తే, ఒక్క హుజూరాబాద్‌కే పరిమితం కానని, రాష్ట్రమంతా తిరిగి, అగ్గిరాజేస్తానన్నారు ఈటల. కేసీఆర్‌ పార్టీని కూల్చేస్తానన్నారు.

హుజూరాబాద్‌లో గెలిచి, రాష్ట్రమంతా టూర్ చేసి, కేసీఆర్‌ పార్టీని కూల్చేస్తానంటున్నారు ఈటల. అంటే ఈటల రాజేందరే స్వయంగా మాట్లాడుతున్నారా? లేదంటే అధిష్టానం సూచనల మేరకే, అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా? కేసీఆర్‌కు ఆల్టర్నేటివ్‌ లీడర్‌గా ఈటలను ఫోకస్ చేస్తే, మరి బండి సంజయ్‌ పరిస్థితి ఏంటి? కిషన్‌ రెడ్డి సంగతేంటి? వంటి ప్రశ్నలు రైజ్‌ అవుతాయి. అయితే వీటన్నింటికీ బీజేపీ దగ్గర రెడీమేడ్ స్ట్రాటజీలు చాలా వున్నాయి.

పశ్చిమ బెంగాల్‌లో తృణముల్ కాంగ్రెస్‌ నుంచి సువెంధు అధికారిని బయటకులాగి, మమతా బెనర్జీకి ప్రత్యామ్నాయంగా ఫోకస్ చేసింది బీజేపీ. నార్త్ ఈస్ట్ స్టేట్స్‌లోనూ కాంగ్రెస్‌ పార్టీ నుంచి కీలకమైన లీడర్లను తమ పార్టీలోకి తీసుకుని, ప్రత్యామ్నాయ నాయకులుగా ముందుపెట్టారు. ఇప్పుడు తెలంగాణలోనూ అలాంటి ప్రయోగమే చెయ్యాలనుకుంటున్నారు అమిత్‌ షా.

Show Full Article
Print Article
Next Story
More Stories