Eatala Rajender: అల్లు అర్జున్‌ ముందే చెప్పాలి.. ఈటల రాజేందర్ హాట్ కామెంట్స్

Eatala Rajender: అల్లు అర్జున్‌ ముందే చెప్పాలి.. ఈటల రాజేందర్ హాట్ కామెంట్స్
x
Highlights

Eatala Rajender comments on Allu Arjun arrest: అల్లు అర్జున్ అరెస్ట్, ఆయనపై కేసు నమోదును ఉద్దేశించి బీజేపి ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు....

Eatala Rajender comments on Allu Arjun arrest: అల్లు అర్జున్ అరెస్ట్, ఆయనపై కేసు నమోదును ఉద్దేశించి బీజేపి ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనం రద్దీగా ఉండే ప్రాంతాలకు సెలబ్రిటీలు వెళ్లినప్పుడు వారి రాక గురించి ముందుగానే చెప్పి వెళ్లాల్సి ఉంటుందన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన విషయంలో అల్లు అర్జున్ ఆ పని చేశారా లేదా అనేది తనకు తెలియదన్నారు. ఏదేమైనా సంధ్య థియేటర్ ఘటన తరువాత తెలంగాణ ప్రభుత్వం అల్లు అర్జున్‌ను వేధిస్తోందని ఈటల అభిప్రాయపడ్డారు.

సీఎం రేవంత్ రెడ్డి వెళ్లిన చోట కూడా రద్దీ ఉండి ఏదైనా ఘటన జరిగితే దానికి ఆయన్ను కూడా బాధ్యుడిని చేస్తారా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ వెళ్లిన చోట ఏదైనా యాక్సిడెంట్ జరిగితే దానికి ఆయన బాధ్యులు కారు కదా అని అన్నారు. అలాగే ప్రధాని మోదీ కూడా ఉత్సవాలకు, జాతరలకు వెళ్తుంటారు. అక్కడ తొక్కిసలాట జరిగి ఏదైనా అయితే దానికి ప్రధాని బాధ్యులవుతారా అని ఈటల ప్రశ్నించారు.

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో చనిపోయిన రేవతి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని ఈటల రాజేందర్ అన్నారు. అలాగే అల్లు అర్జున్ కూడా ఆ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవాల్సిన అవసరం ఉందని చెప్పారు. అల్లు అర్జున్ అరెస్ట్ అంశంపై ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐతో మాట్లాడుతూ ఈటల రాజేందర్ ఈ వ్యాఖ్యలు చేశారు (Eatala Rajender about Allu Arjun arrest).

Show Full Article
Print Article
Next Story
More Stories