Telangana: టీఆర్ఎస్‌ చేసిన అక్రమాలపై సీబీఐతో విచారణ చేయించాలి: రాంచందర్​ రావు

BJP MLC Candidate Ramchandar Rao met Election Officer
x

Telangana: టీఆర్ఎస్‌ చేసిన అక్రమాలపై సీబీఐతో విచారణ చేయించాలి: రాంచందర్​ రావు

Highlights

Telangana: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరిగాయని బీజేపీ నేత రాంచందర్​రావు ఆరోపించారు.

Telangana: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరిగాయని బీజేపీ నేత రాంచందర్​రావు ఆరోపించారు. ఈ అంశాలపై సీబీఐతో విచారణ చేయించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్‌ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిందని ఆరోపించారు. దొంగ ఓట్లు వేయించి, భారీ ఎత్తున డబ్బు పంచారన్నారు. పట్టభద్రుల ఎన్నికలు పారదర్శకంగా జరగలేదని దీనిపై సీబీఐ దర్యాప్తు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక గోయల్‌ను కోరారు.

ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ, పీఆర్సీపై ముందే లీకులు ఇవ్వడం ద్వారా అధికారపక్షం ఉద్యోగులతో ఓట్లు వేయించుకుందని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోట్లు చేతులు మారాయని అన్నారు. గూగుల్ పే, పేటీఎం యాప్ ల సాయంతో ఓటర్లకు నగదు పంపిణీ చేశారని వెల్లడించారు. నకిలీ సర్టిఫికెట్లతో ఎమ్మెల్సీ ఓట్లు నమోదు చేయించారని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories