Raja Singh Comment on CM KCR: సీఎం కేసీఆర్ పేరు కూడా తరతరాలు వినపడాలనే ఇలా చేసారు : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్

Raja Singh Comment on CM KCR: సీఎం కేసీఆర్ పేరు కూడా తరతరాలు వినపడాలనే ఇలా చేసారు : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్
x
BJP MLA Raja Singh fires CM KCR
Highlights

Raja Singh Comment on CM KCR: మరో 50 ఏళ్లు పని చేసే పాత సచివాలయాన్ని తెలంగాణ ప్రభుత్వం అనవసరంగా కూల్చి వేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు.

BJP MLA Raja Singh fires CM KCR: మరో 50 ఏళ్లు పని చేసే పాత సచివాలయాన్ని తెలంగాణ ప్రభుత్వం అనవసరంగా కూల్చి వేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. సీఎం కేసీఆర్ పేరు ప్రతిష్ఠల కోసమే కొత్త సచివాలయ భవన నిర్మాణాన్ని తలపెట్టారని విమర్శించారు. ఇందులో భాగంగానే మంగళవారం ఆయన ఓ వీడియోను మీడియాకు విడుదల చేశారు. నిజాం కాలంలో కట్టిన కట్టడాల వల్ల ఆయన పేరు ఇంకా వినబడుతోందని ఇప్పుడు అదే విధంగా సీఎం పేరు కూడా తరతరాలు వినపడాలనే ఉద్దేశంతోనే కొత్త సచివాలయం నిర్మిస్తున్నారని ఆరోపించారు.

పాత సచివాలయం కూల్చి కొత్త సచివాలయం కట్టడానికి ప్లాన్ వేసారని ఆ కొత్త సచివాలయ ఆకృతిని ఏఐఎంఐఎం పార్టీ వాళ్లు ఇచ్చి ఉంటారా అని వ్యాఖ్యానించారు. కొత్త సచివాలయ నమూనా మసీదు, హజ్ హౌస్‌ను తలపిస్తోందని ఎమ్మెల్యే విమర్శించారు. గుడి, మసీదు, హజ్ హౌస్‌లు ప్రతిబింబించేలా కాకుండా కొత్త సచివాలయాన్ని వినూత్నంగా నిర్మించేలా ప్రణాళిక రూపొందించాలని హితవు పలికారు. సీఎం కేసీఆర్ ఈ డిజైన్‌ను ఎంపిక చేసి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నించారు. సచివాలయం నిర్మించే సొమ్ము తమ సొంత సొమ్ము కాదని, అది ప్రజలదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు.

ఇక పోతే పాత సచివాలయ భవనం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం సోమవారం అర్థరాత్రి నుంచి సచివాలయం కూల్చివేత పనులను వేగవంతం చేసింది. ప్రభుత్వ ఆదేశం మేరకు అధికారులు సోమవారం అర్థరాత్రి నుంచే కూల్చివేతకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ క్రమంలోనే పోలీసులను భారీగా మొహరించి ట్యాంక్‌బండ్‌, ఖైరతాబాద్, మింట్ కాపౌండ్ సెక్రెటరేట్ దారులను మూసివేశారు. 132 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన సచివాలయం. నిజాం నవాబుల పాలనా కేంద్రంగా సైఫాబాద్ ప్యాలెస్ పేరుతో ప్రసిద్ధి చెందింది. ఈ సచివాలయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ముఖ్యమంత్రుల పాలనా కేంద్రంగా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories