Bandi Sanjay: నేటి నుంచి బీజేపీ నేత బండి సంజయ్ ప్రజాహిత పాదయాత్ర

BJP leader Bandi Sanjay Prajahita Padayatra from today
x

 Bandi Sanjay: నేటి నుంచి బీజేపీ నేత బండి సంజయ్ ప్రజాహిత పాదయాత్ర

Highlights

Bandi Sanjay: కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఏడు సెగ్మెంట్లలో పాదయాత్ర

Bandi Sanjay: బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాహిత పాదయాత్ర శనివారం నుంచి ప్రారంభం కానుంది. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఏడు సెగ్మెంట్లలో పాదయాత్ర కొనసాగనుంది. ఇవాళ వేములవాడ సెగ్మెంట్ పరిధిలో బండి సంజయ్ పర్యటించనున్నారు. నేడు మేడిపల్లి, బీమారం, కథలాపూర్ మండలాల్లో సంజయ్ పర్యటించనున్నారు.

తొలి విడతలో ఈ నెల 10 నుంచి 15 వరకు ప్రజాహిత పాదయాత్ర ఆయన పర్యటన కొనసాగనుంది. తొలి విడతలో వేముల వాడ, సిరిసిల్ల సెగ్మెంట్లలో బండి పాదయాత్ర చేపట్టనున్నారు. నిన్న జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలో బీజేపీ అధ్యక్షులు మోరపల్లి సత్యనారాయణరావు, ప్రతాప రామకృష్ణ ఏర్పాట్లను పరిశీలించారు. గ్రామాల్లో కాలినడకన, బయటకు వచ్చాక వాహనంలో యాత్ర కొనసాగించనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories